PM Narendra Modi: కరోనా కట్టడికి నాలుగు ఫాయింట్ ఫార్ములా.. రాష్ట్రాలకు సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ
కరోనా కట్టడికి నాలుగు ఫాయింట్ ఫార్ములా సూచించారు ప్రధాని మోదీ. టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా విధానాన్ని మరింత స్పీడప్ చేయాలన్నారు.
PM Narendra Modi Video Conference: కరోనా కట్టడికి నాలుగు ఫాయింట్ ఫార్ములా సూచించారు ప్రధాని మోదీ. టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా విధానాన్ని మరింత స్పీడప్ చేయాలన్నారు. 6 రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌గా సమావేశమైన ప్రధాని..థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
దేశంలో కరోనా, డెల్టా విజృంభణ..పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు.. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వార్నింగ్స్ నేపథ్యంలో 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్పెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులు మోదీతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. కఠిన నిబంధనలు అమలు చేసి థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని.. టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా ఫార్ములాను మరింత స్పీడప్ చేయాలన్నారు.
Reviewed the COVID-19 situation with Chief Ministers. Emphasised on testing, tracking and treating to overcome the pandemic. Also highlighted the need to strengthen COVID related infrastructure in the rural areas. https://t.co/Q0gDeTo2ns
— Narendra Modi (@narendramodi) July 16, 2021
ఈమేరకు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవలసిన అవసరముందని గుర్తు చేశారు. కరోనాపై మరింత అవగాహన, అప్రమత్తత అవసరమని..పరిస్థితులు చేయిదాటితే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గడిచిన వారం నుంచి 80 శాతం కేసులు..ఆ ఆరు రాష్ట్రాల్లోనే వెలుగు చూస్తున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని హెచ్చరించారు.
ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇక రెండ్రోజుల క్రితం ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన ప్రధాని..త్రిపురలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోందని.. కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు. రోజుకో రూపం మార్చుకుంటున్న కరోనా వేరియంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. న్యూ స్ట్రెయిన్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. అలాగే కోవిడ్ నియంత్రణకు అయా ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను స్పీడప్ చేయాలని పేర్కొన్నారు.
Reviewing the COVID-19 situation with Chief Ministers. https://t.co/NKHL3Mz0yk
— Narendra Modi (@narendramodi) July 16, 2021
కాగా, ఈ సందర్భంగా అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి పలు సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడానికి పూర్తిస్థాయిలో టీకాలను సరఫరా చేయాలని కోరారు. సీఎంల సూచనలు పరిగణంలోకి తీసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పారు.
Read Also… AP CM YS Jagan: ఆ టీకాలను రాష్ట్రాలకు కేటాయించండి.. ప్రధాని మోదీని కోరిన సీఎం వైఎస్ జగన్