Pragya Singh Thakur: డ్యాన్స్‌ చేస్తారు.. కానీ ఆసుపత్రికి వెళ్లలేరా?.. ప్రగ్యా ఠాకూర్‌పై విమర్శల వెల్లువ

BJP MP Pragya Thakur: భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే.. ప్రగ్యా ఠాకూర్‌ ఇంటి దగ్గర వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వీడియో

Pragya Singh Thakur: డ్యాన్స్‌ చేస్తారు.. కానీ ఆసుపత్రికి వెళ్లలేరా?.. ప్రగ్యా ఠాకూర్‌పై విమర్శల వెల్లువ
Pragya Singh Thakur
Follow us

|

Updated on: Jul 16, 2021 | 4:41 PM

BJP MP Pragya Thakur: భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే.. ప్రగ్యా ఠాకూర్‌ ఇంటి దగ్గర వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తునాయి. బాక్సెట్ బాల్ ఆడేందుకు, డ్యాన్స్‌ చేయడానికి ఓపిక ఉంటుంది.. కానీ ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోలేరా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా.. ప్రగ్యా ఠాకూర్‌ రెండు రోజుల క్రితం ఇంటి దగ్గరే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆరోగ్య సిబ్బందిని ఇంటికి పిలిపించుకొని మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రగ్యా ఠాకూర్‌ కొద్ది రోజుల క్రితం బాస్కెట్‌ బాల్‌ ఆడారు.. ఆ తర్వాత ఓ వివాహ వేడుకలో డ్యాన్స్‌ సైతం చేశారు.. కానీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ మాత్రం ఇంటి దగ్గరే వేయించుకున్నారంటూ కాంగ్రెస్‌ నేత నరేంద్ర సులజా విమర్శించారు. ప్రధాని మోదీ నుంచి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వరకు అందరూ ఆసుపత్రులకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.. కానీ ప్రగ్యా ఠాకూర్‌ వెళ్లడానికి ఇబ్బంది ఎందుకంటూ ప్రశ్నించారు. డ్యాన్స్‌ వేయాడానికి ఓపిక ఉంటుంది.. కానీ టీకా వేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లలేరా.. నరేంద్ర సులజా విమర్శలు చేశారు. దీంతోపాటు నెటిజన్లు సైతం ప్రగ్యా ఠాకూర్‌పై మండిపడుతున్నారు. పలు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వివాదంపై అధికారులు స్పందించారు. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక నియమం కింద ప్రగ్యా ఠాకూర్‌ తన నివాసంలోనే వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు. కాగా.. రాష్ట్ర నియమం ప్రకారం.. వృద్ధులకు, దివ్యాంగులకు ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చని రాష్ట్ర అధికారి సంతోష్‌ శుక్లా తెలిపారు.

Also Read:

PM Narendra Modi: కరోనా కట్టడికి నాలుగు ఫాయింట్‌ ఫార్ములా.. రాష్ట్రాలకు సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ

Telangana: ఆదిలాబాద్‌లో గోదాములపై అధికారుల దాడులు.. అనుమతిలేని గోదుమ పిండి నిల్వలు సీజ్.. పలువురి అరెస్ట్..