Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: ఆ టీకాలను రాష్ట్రాలకు కేటాయించండి.. ప్రధాని మోదీని కోరిన సీఎం వైఎస్‌ జగన్‌

అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేకున్నా.. కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు.

AP CM YS Jagan: ఆ టీకాలను రాష్ట్రాలకు కేటాయించండి.. ప్రధాని మోదీని కోరిన సీఎం వైఎస్‌ జగన్‌
Ap Cm Ys Jagan Request To Pm Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 16, 2021 | 2:55 PM

AP CM YS Jagan Request to PM Modi: అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేకున్నా.. కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం జగన్‌. కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.

రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామని, అయినప్పటికీ సమర్థవంతంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొన్నామన్నారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవు. అయినా కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనపరిచామని సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీ ద‌ృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయన్నారు. ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశామని.. తద్వారా అనారోగ్యానికి గురైనవారిని తక్షణమే గుర్తించి చికిత్స అందించడంలో సఫలికృతమయ్యామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేశామని, దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరణను అడ్డుకోగలిగామన్నారు.

మరోవైపు, వ్యాక్సినేషన్‌ అనేది కోవిడ్‌కు సరైన పరిష్కారం అని భావించి రాష్ట్రవ్యాప్తంగా టీకా కార్యక్రమం విస్తృతస్థాయిలో చేపట్టామన్నారు. ఒకే రోజు లక్ష మందికి పైగా వ్యాక్సినేషన్‌లో రికార్డు సృష్టించామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి జగన్.

ఇక, ఇప్పటివరకు రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు అందాయని, వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాల వల్ల ఇచ్చినదానికన్నా ఎక్కువ మందికి వేయగలిగామన్నారు. ఒక్క జులై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని గుర్తు చేసిన సీఎం జగన్.. జులైనెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారన్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. జూన్‌నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. రాష్ట్రంలో మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది. కోవిడ్‌నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామన్నారు.

Read Also…  Tribals : వర్ణణాతీతంగా ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు.. గాలిలో దీపాల్లా నిండు గర్భవతులు, నవజాత శిశువుల ప్రాణాలు.!