Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tribals : వర్ణణాతీతంగా ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు.. గాలిలో దీపాల్లా నిండు గర్భవతులు, నవజాత శిశువుల ప్రాణాలు.!

టెక్నాలజీతో ప్రపంచం పోటీ పడుతోంది. క్షణాల్లో ఏదీ కావాలంటే అది మన ముందు వాలిపోతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం..

Tribals : వర్ణణాతీతంగా ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు.. గాలిలో దీపాల్లా నిండు గర్భవతులు, నవజాత శిశువుల ప్రాణాలు.!
Tribals
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 16, 2021 | 2:30 PM

Tribals – Visakha Agency: టెక్నాలజీతో ప్రపంచం పోటీ పడుతోంది. క్షణాల్లో ఏదీ కావాలంటే అది మన ముందు వాలిపోతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. విశాఖలోని గిరిజనుల కష్టాలు వర్ణణాతీతమనే చెప్పాలి. ముఖ్యంగా ఆనారోగ్య సమస్యలు వస్తే.. అంబులెన్స్ వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో వారికి డోలీనే ప్రధాన దిక్కవుతోంది. సరైన రహదారి లేని కారణంగా ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తున్నారు ఏజెన్సీ ప్రజలు.

తాజాగా సుల్తాన్ పుట్టు కు చెందిన చెల్లమ్మ అనే నిండు గర్భిణి పురిటినొప్పులతో.. మూడు కిలోమీటర్ల మేర నడక సాగించి, ఒక ప్రైవేట్ వాహనం సహాయంతో రూడకోట పీహెచ్సీ లో ప్రసవం అయ్యారు. మగబిడ్డ పుట్టారన్నా సంతోషం కాసేపైనా లేదు. పుట్టిన మగ శిశువు మృతి చెండాడు. ఈ ఘటన అందరినీ ఆవేదనకు గురిచేసింది. బిడ్డ పుట్టారన్న ఆనందం క్షణాల్లో అవిరైపోవడంతో.. తల్లితండ్రులు మౌనం గా రోదిస్తూ ఇంటికి వెళ్లిపోయారు.

ఇటీవలనే గెమ్మేలిబారుకు చెందిన కొర్రా జానకి అనే గర్భిణీ డోలీ లోనే ప్రసవం కాగా.. తల్లీ బిడ్డా మృతి చెందిన ఘటన మరువకముందే ఇంకో ఘటన చోటుచేసుకోవడాన్ని మన్యం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. గర్భిణీ స్త్రీల సమాచారాన్ని సేకరించి ముందస్తుగానే హాస్పిటల్స్ కి తరలించాలని ప్రభుత్వం చెబుతున్నా అమలులో సాధ్యపడడం లేదు.

మన్యంలో గర్భిణీల, నవ జాత శిశువుల వరుస మరణాలపై గిరిజనంలో ఆందోళన నెలకొని ఉంది. మారుమూల గ్రామాల్లో రహదారులు లేకపోవడం వల్లే.. ఇటువంటి పరిస్థితులు తమకు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమ సమస్యలను తీర్చాలని వేడుకుంటున్నారు ధీనంగా.

Read also: Sharmila: తెలంగాణ నీరు చుక్క కూడా వదులుకోం, జగన్.. కెసిఆర్ ఫ్రెండ్సే. ప్రభంజనమే.. రాసి పెట్టుకోండి : షర్మిల