AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharmila: తెలంగాణ నీరు చుక్క కూడా వదులుకోం, జగన్.. కెసిఆర్ ఫ్రెండ్సే. ప్రభంజనమే.. రాసి పెట్టుకోండి : షర్మిల

సింహం సింగిల్ గా ఉందని బయపడకండి.. నేను ఒంటరిని కాను. జంపింగ్ జపాంగ్స్ నాకు అవసరం లేదు. జగన్, కెసిఆర్ ఇద్దరూ స్నేహితులే.. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు....

Sharmila: తెలంగాణ నీరు చుక్క కూడా వదులుకోం, జగన్.. కెసిఆర్ ఫ్రెండ్సే. ప్రభంజనమే.. రాసి పెట్టుకోండి : షర్మిల
Ys Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 16, 2021 | 2:19 PM

YS Sharmila – KCR – Jagan – KTR: కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీరు కూడా వదులుకోమని తేల్చి చెప్పారు వైఎస్సార్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల. ఉద్యమంలో పాల్గొనని వాళ్లకు తెలంగాణ పై ప్రేమ లేనట్టా? అని ప్రశ్నించిన ఆమె, తెలంగాణ ఏర్పాటు అవసరం అని చెప్పామని గుర్తు చేసుకున్నారు. “నక్కతోక చూపెట్టి పులి.. పులి అంటున్నారు. అలిగితే పుట్టింటికి వెళ్లడం మానేస్తారు కానీ.. పార్టీ పెట్టరు. విభేదించి పెట్టిన పార్టీ కాదు. ప్రజల పై ప్రేమ తో పెట్టిన పార్టీ ఇది.” అని ఆమె తన పార్టీ ఏర్పాటుకు దోహదం చేసిన అంశాల్ని గురించి షర్మిల వివరించారు.

“కేటీఆర్ అంటే ఎవరు..? కేసీఆర్ కొడుకా ? అంటూ షర్మిల సెటైర్లు వేశారు. “వ్రతాలు చేసుకోవడానికి మహిళలు ఉన్నారు అని కేటీఆర్ తేల్చాడు.. అవును మేము మహిళలం వ్రతాలే చేసుకుంటాం. ఏపీలో రెండేండ్లయింది జగన్ ప్రభుత్వం వచ్చి.. రాజన్న రాజ్యం కోసం పాటుపడుతున్నట్లు కనిపిస్తోంది.. లేదంటే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తారు.” అని షర్మిల వ్యాఖ్యానించారు.

“సింహం సింగిల్ గా ఉందని బయపడకండి.. నేను ఒంటరిని కాను. జంపింగ్ జపాంగ్స్ నాకు అవసరం లేదు. జగన్, కెసిఆర్ ఇద్దరూ స్నేహితులే.. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు.. పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది వైఎస్సార్. కాంగ్రెస్ వైఎస్ కు వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్ కి సిగ్గులేదు. ఆస్తులు కాపాడుకోవడానికి ఉన్న రాజకీయ నాయకులు నాకు వద్దు. ప్రజల నుండి నేను నాయకులు తెచ్చుకుంట. చులకన చేయడం భావ్యం కాదు. ప్రభంజనం సృష్టిస్తా.. రాసి పెట్టుకోండి. ” అని షర్మిల హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Hidden treasures : శంషాబాద్ మండలంలో గుప్తనిధులు.! పూరాతన గుమటంలో తవ్వకాల కలకలం