PM Narendra Modi: గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ.. కీలక ప్రసంగం..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. గురునానక్ దేవ్ జీ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో శ్రీ గురునానక్ దేవ్ జీ 553వ జయంతి వేడుకలు జరగనున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. గురునానక్ దేవ్ జీ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో శ్రీ గురునానక్ దేవ్ జీ 553వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా నివాసంలో ఈ వేడుక జరుగనుంది. ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లోని 95లో శ్రీ గురునానక్ దేవ్ జీ 553వ జయంతి వేడుకలు జరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
జాతీయ మైనారిటీ కమిషన్ చైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా నివాసంలో జరిగే ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని.. శ్రీ గురునానక్ దేవ్ జీకి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని పీఎంఓ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తారని వెల్లడించింది.




On the eve of #GuruNanakJayanti, PM @narendramodi will participate in the 553rd Birth Anniversary celebration of Sri Guru Nanak Dev ji at 95, Lodhi Estate in Delhi today evening at around 8 PM. @PMOIndia pic.twitter.com/cWExGdWzQa
— DD News (@DDNewslive) November 7, 2022
ఇదిలావుండగా గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ మానవజాతికి ప్రబోధించిన మార్గదర్శకాలు.. విలువలు ఆచరణనీయమని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




