PM Modi: 10 రోజులు.. 12 రాష్ట్రాలు.. ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన

10 రోజులు.. 12 రాష్ట్రాలు..ఇవాళ్టి నుంచి ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్న 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు..మార్చి రెండో వారంలో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది.. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు మోదీ.

PM Modi: 10 రోజులు.. 12 రాష్ట్రాలు.. ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన
Modi National Tour
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 04, 2024 | 8:43 AM

10 రోజులు.. 12 రాష్ట్రాలు..ఇవాళ్టి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రానున్న 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు..మార్చి రెండో వారంలో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది.. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు మోదీ..12 రాష్ట్రాల్లో వివిధ అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తారు..

ఇవాళ్టి 4 నుంచి 10 రోజుల పాటు.. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మోదీ షెడ్యూల్ ఖరారు అయ్యింది. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్, జమ్మూకాశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని పర్యటన ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణలో వరుసగా రెండు రోజులు పర్యటించనున్నారు.

ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఉదయం డిల్లీ నుంచి నాగ్‌పూర్‌.. అక్కడి నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 10.30 నిమిషాలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రూ. 6,697 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ. రేపు సంగారెడ్డిలో పర్యటింటి పలు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వనున్నారు.

మార్చి 6న కోల్‌కతాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక 7న జమ్మూకశ్మీర్‌లో పర్యటించాక, ఢిల్లీకి చేరుకుని ఓ ఈవెంట్‌లో పాల్గొంటారు. అటు 8, 9 తేదీల్లో మొదటి రోజు ఢిల్లీలో మర్నాడు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం పశ్చిమబెంగాల్‌లోని శిలిగుడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక 10న ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ, 11న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12న గుజరాత్‌లోని సబర్మతి, రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు. 13న గుజరాత్‌, అస్సాంలో మూడు ముఖ్యమైన సెమీ కండక్టర్ల ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఇలా ఎన్నికల వేళ 10 రోజుల్లో 12 రాష్ట్రాలు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!