Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sengol: ‘స్వాతంత్ర్యానికి చిహ్నం రాజదండం’.. వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబానికి ప్రధాని మోడీ సత్కారం..

Vummidi Bangaru Chetty family: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. లోక్‌సభలో స్పీకర్ కుర్చీ వెనుక చారిత్రాక సెంగోల్ (రాజదండం) ను ప్రతిష్టించారు.

Sengol: ‘స్వాతంత్ర్యానికి చిహ్నం రాజదండం’.. వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబానికి ప్రధాని మోడీ సత్కారం..
Vummidi Bangaru Chetty Family Honored by PM Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 30, 2023 | 7:18 AM

Vummidi Bangaru Chetty family: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. లోక్‌సభలో స్పీకర్ కుర్చీ వెనుక చారిత్రాక సెంగోల్ (రాజదండం) ను ప్రతిష్టించారు. బ్రిటిష్ వారు భారతీయులకు అధికారాన్ని (స్వాతంత్ర్యం) అప్పగిస్తూ.. ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించారు. ఈ రాజదండాన్ని “సెంగోల్” అని పిలుస్తారు. ఇది తమిళ పదం ‘సెమ్మై’ నుంచి ఉద్భవించింది.. దీని అర్థం “ధర్మం”.. ఆగష్టు 14, 1947న నెహ్రూకు అప్పగించిన ఈ సెంగోల్ బ్రిటీష్ ప్రభుత్వం నుండి భారతదేశానికి అధికార బదిలీని సూచిస్తుంది. న్యాయం, పాలన శక్తివంతమైన ప్రాతినిధ్యంగా పరిగణిస్తున్న ఈ సెంగోల్ దేశానికి చిహ్నంగా మారింది.

అయితే, కొత్త పార్లమెంట్ భవనంలో లోక్‌సభ స్పీకర్ కుర్చీ వెనుక ఉంచిన సెంగోల్.. తయారీదారులైన వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న వేళ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సెంగోల్ ప్రతిష్టంభన వేడుకను నిర్వహించి.. దీని వెనుకున్న వారి కృషిని అభినందించింది.

వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబానికి చెందిన వుమ్మిడి అనిల్ కుమార్ మే 27, 2023న ప్రధానమంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మోడీ నుంచి సత్కారం పొందారు. అనంతరం ఆనందం, గౌరవంతో తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన స్వాతంత్ర్యానికి విశేషమైన చిహ్నంగా సెంగోల్ కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ వేడుక సెంగోల్ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించడమే కాకుండా భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో దాని ఔచిత్యాన్ని, శాశ్వత విలువను కూడా నొక్కి చెప్పింది. వుమ్మిడి కుటుంబానికి అపారమైన సాంస్కృతిక, చారిత్రిక ప్రాముఖ్యత కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

వుమ్మిడి అనిల్ కుమార్ దుకాణం 1947లో అధీనాలకు (బంగారు రాజదండం) సెంగోల్‌ను పంపిణీ చేయడానికి చాలా కృషి చేసిందని, పురాతన ప్రాంగణంగా (వుమ్మిడి ద్వారక్‌నాథ్ జ్యువెలర్స్‌ని ప్యారీస్, చెన్నైలో “కార్నర్ షాప్” అని పిలుస్తారు) పేర్కొనడం గర్వంగా ఉందని తెలిపారు. వుమ్మిడి కుటుంబం 1920 నుంచి బంగారు దుకాణాన్ని నిర్వహిస్తోంది. సెంగోల్ వారసత్వం ప్రారంభమైన ప్రదేశాన్ని సంరక్షించడంలో, దానిని గౌరవించడంలో వుమ్మిడి అనిల్ కుమార్, కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించినందుకు ప్రధాని మోడీ నుంచి ఈ సత్కారం లభించడం.. వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది.

ఈ సందర్భంగా శ్రీ వుమ్మిడి అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ.. ”సంవత్సరాలుగా కుటుంబ పురోభివృద్ధిలో విలువలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబానికి చెందిన గౌరవనీయులైన పెద్దలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. 1947లో సెంగోల్‌ను రూపొందించడంలో వారి అచంచలమైన అంకితభావం, నిబద్ధత ఎంతో గౌరవించబడింది.” అంటూ పేర్కొన్నారు.

వుమ్మిడి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సెంగోల్ పునః-ఆవిష్కరణలో పాల్గొన్న కుటుంబ సభ్యుల కీలక సహకారాన్ని గుర్తిస్తున్నారన్నారు. ఈ చారిత్రాత్మక కళాఖండాన్ని గుర్తించి, వేడుకగా జరుపుకోవడంలో వారి శ్రద్ధగల కృషి, నిశిత పరిశోధనలు ముగిశాయన్నారు.

వుమ్మిడి అనిల్ కుమార్ ఈ సందర్భంగా ప్రధాని మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. తనకు, వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబానికి ఈ అసాధారణ గౌరవాన్ని అందించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..