ప్రధాని మోదీ కీలక సమీక్ష.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సంచలన నిర్ణయం!
టూరిజం రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పహల్గామ్ దాడి తరువాత కశ్మీర్‌కు టూరిస్టుల సంఖ్య తగ్గడంలో ఈ వ్యవహారంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. జమ్ముకశ్మీర్‌కు టూరిస్టులను ఆకర్షించేలా పలు కార్యక్రమాలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

టూరిజం రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పహల్గామ్ దాడి తరువాత కశ్మీర్‌కు టూరిస్టుల సంఖ్య తగ్గడంలో ఈ వ్యవహారంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. జమ్ముకశ్మీర్‌కు టూరిస్టులను ఆకర్షించేలా పలు కార్యక్రమాలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పర్యాటక రంగంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ , పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా టూరిజం రంగం పై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య తగ్గింది. కశ్మీర్‌కు కూడా వెళ్లడానికి టూరిస్టులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో పర్యాటకులను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీ చర్చించారు.
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా జమ్ముకశ్మీర్‌లో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. కశ్మీర్‌లో టూరిస్టుల భద్రతపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇప్పటికే హోటల్ యాజమానులతో సమావేశమయ్యారు. కశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని మోదీ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో పర్యటించడానికి వచ్చే ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తామని కేంద్రం భరోసా ఇస్తోంది. దేశంలో టూరిజం ప్రాజెక్ట్‌ల పురోగతిపై కూడా అడిగి తెలుసుకున్నారు మోదీ. కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ , సహాయ శాఖ మంత్రి సురేశ్ గోపి , కేంద్ర టూరిజం శాఖ కార్యదర్శి విద్యావతి ఈ సమావేశానికి హాజరయ్యారు.
భారత్‌ను అంతర్జాతీయ టూరిజం మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలపాలని అధికారులకు మోదీ సూచించారు. అధ్యాత్మిక టూరిజం, స్వదేశ్ దర్శన్ లాంటి కార్యక్రమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని కోరారు. అధ్యాత్మిక క్షేత్రాల్లో భక్తులకు వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. టూరిస్ట్ ప్లేస్‌లను మరింత అభివృద్ది చేయాలన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత కశ్మీర్‌కు పర్యాటకులు తగ్గిన సంగతి వాస్తవమేనని కేంద్రం చెబుతోంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ టూరిజం రంగంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




