PM Security Lapse Video: ప్రధాని మోదీ పంజాబ్ టూర్‌లో అడగడుగునా భద్రతా డొల్లతనం.. వెలుగులోకి వచ్చిన మరో వీడియో
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ టూర్‌లో మరిన్ని సంచనాలు వెలుగుచూస్తున్నాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. భద్రతా డొల్లతనాన్ని తలపించింది ప్రధాని పంజాబ్ టూర్.
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ టూర్‌లో మరిన్ని సంచనాలు వెలుగుచూస్తున్నాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. భద్రతా డొల్లతనాన్ని తలపించింది ప్రధాని పంజాబ్ టూర్. ప్రధాని భద్రతా వైఫల్యం తాలూకూ వీడియోలు లేటెస్ట్‌గా బయటకొస్తున్నాయి. సదరు వీడియోల్లో భద్రతా వైఫల్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. రైతుల ఆందోళనలతో వెనుదిరిగిన ప్రధాని మోదీ కాన్వాయ్ దగ్గర బీజేపీ కార్యకర్తలు సైతం గుమిగూడడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ కాన్వాయ్ పక్కనే బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండా చేతబట్టుకొని కనిపించారు. అంతేకాకుండా బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్‌కు దగ్గరగా వచ్చేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. కాన్వాయ్ దగ్గరకు కార్యకర్తలు దూసుకొస్తుండడాన్ని గమనించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని చుట్టూ వలయంగా ఏర్పడింది.
ఇప్పటికే.. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టులోనూ విచారణ జరుగుతోంది. రూట్ క్లియర్ చేయాల్సిన పంజాబ్ పోలీసులు భద్రతను గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన బీజేపీ కార్యకర్తల వీడియో భద్రత డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోంది.
ప్రధాని మోడీ భద్రతా వలయాన్ని బీజేపీ కార్యకర్తలే ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ప్రధాని భద్రతా వైఫల్యానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తల తీరుపై ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రధానితో పాటు దేశ భద్రతకు బీజేపీ కార్యకర్తలే ముప్పుగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పంజాజ్, కాంగ్రెస్ సీఎం చన్నీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నించారని..ఈ వీడియో దీనికి తార్కారణంగా పేర్కొన్నారు.
Modi ji, isn’t this proof that you tried to defame the people of Punjab and Congress CM @CHARANJITCHANNI‘s Govt?
The only threat to PM and the nation’s security are BJP workers ? pic.twitter.com/gAilQVEbEM
— Mallikarjun Kharge (@kharge) January 7, 2022
Also Read..
Pawan Kalyan: పంజాబ్ ఘటన దురదృష్టకరం.. ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యంపై పవన్ కామెంట్స్..