Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cock Fighting: అక్కడ కోడిపందాలు నిర్వహణకు కోర్టు అనుమతి.. ఈ కండిషన్స్ పాటించాల్సిందే..

Cock Fighting: తెలుగువారికే కాదు.. తమిళనాడు లో సంక్రాంతి పెద్ద పండగ..  పొంగల్ గా తమిళనాడులో ఈ పండగను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు. మొదటి రోజుని భోగి పొంగల్ అని..

Cock Fighting: అక్కడ కోడిపందాలు నిర్వహణకు కోర్టు అనుమతి.. ఈ కండిషన్స్ పాటించాల్సిందే..
Tamilnadu Cock Fight
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2022 | 5:35 PM

Cock Fighting: తెలుగువారికే కాదు.. తమిళనాడు లో సంక్రాంతి పెద్ద పండగ..  పొంగల్ గా తమిళనాడులో ఈ పండగను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు. మొదటి రోజుని భోగి పొంగల్ అని.. రెండో రోజున థాయ్ పొంగల్ అని .. మూడో రోజున మట్టు పొంగల్, నాలుగో రోజున కనుమ పొంగల్ గా ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను సంప్రాదయాలను పాటిస్తూ.. సంబరాలు అంబరాన్ని తాకేలా జరుపుకోవడం విశిష్టత. అయితే తమిళనాడు పొంగల్ అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది జల్లు కట్టు ఆట.. మధురై చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే ఈ  వేడుకను చూడటానికి భారీగా జనం చేరుకుంటారు. అయితే ఇప్పుడు తాజాగా మధురై జిల్లాలో కోడి పందాలు కొలువుదీరనున్నాయి. ఈ మేరకు మధురై హైకోర్టు అనుమతినిచ్చింది

పొంగల్ సమయం లో మధురై జిల్లాలో కోడి పందాలు జరుపుకోవడానికి మధురై హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కొందరు గ్రామస్థులు  ఉత్తమపాళయం లో కోడి పందాలను జారుకోవడానికి అనుమతిని కోరుతూ  కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. పందాల సమయంలో కోడి కాళ్లకు కత్తులు, బ్లేడ్, కట్టకూడదని నిబంధనలని విధించింది. అంతేకాదు.. కోడి పందాలను అధికారుల పర్యవేక్షణ లో జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సంక్రాంతి పండగ.. కోడి పందాలు అంటే.. వెంటనే ఎవరికైనా గుర్తుకొచ్చేది గోదావరి జిలాల్లోని సందడే..

Also Read:  రష్యా నుంచి హైదరాబాద్‌లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ .. న్యూ లుక్‌‌కు ఫ్యాన్స్ ఫిదా..