పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధానమంత్రి.. మోదీ మనసు గెలిచిన జావెలిన్ త్రోయర్
పారిస్ పారాలింపిక్స్ 2024 విజయభేరి అనంతరం స్వదేశానికి వచ్చిన భారత అథ్లెట్లు గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పారాలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్క అథ్లెట్, కోచ్‌లను అందరినీ ఒక్కొక్కరిగా కలిసిన ప్రధాని..

పారిస్ పారాలింపిక్స్ 2024 విజయభేరి అనంతరం స్వదేశానికి వచ్చిన భారత అథ్లెట్లు గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పారాలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్క అథ్లెట్, కోచ్‌లను అందరినీ ఒక్కొక్కరిగా కలిసిన ప్రధాని.. విదేశీ గడ్డపై భారతదేశాన్ని గర్వించేలా చేసినందుకు వారిని అభినందించారు.
ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి
పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ 29 పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. 2020 టోక్యో పారా గేమ్స్‌లో 10 పతకాల కంటే ఇది రెండింతలు అత్యుత్తమం. ఈ పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఏడు స్వర్ణాలతో పతకాల పట్టికలో చారిత్రాత్మకంగా 18వ స్థానాన్ని సాధించింది. పలు అథ్లెట్ల పతకాలపై సంతకం చేసిన ప్రధాని మోదీ.. జావెలిన్ త్రోయర్ నవదీప్ సింగ్ సిగ్నేచర్ మూమెంట్ చూసి ఫిదా అయ్యారు.
Paralympics 2024 | చారిత్రక విజయాల అనంతరం ప్రధాని మోదీని కలిసిన ఛాంపియన్స్.. వీడియో చూసేయండి.#ParisParalympics #Paralympics2024 #Paris2024 #TV9News #TV9Telugu #ParisParalympics2024 pic.twitter.com/rILB67hLMy
— TV9 Telugu (@TV9Telugu) September 12, 2024
ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు
మరోవైపు ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో జరిగిన 2024 పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 84 మంది పారా-అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 12 విభాగాల్లో పోటీపడిన అథ్లెట్లు టోక్యో 2020 కంటే ఎక్కువ పతకాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
.@narendramodi మనస్సును గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నవదీప్ సింగ్.#ParisParalympics #Paralympics2024 #Paris2024 #TV9News #TV9Telugu #ParisParalympics2024 pic.twitter.com/xaAuHLCgt4
— TV9 Telugu (@TV9Telugu) September 12, 2024
ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..