AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viksit Bharat Sankalp Yatra: ప్రధాని మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర గురించి తెలుసా.. దీని వల్ల కలిగే ప్రయోజనం ఇదే..

కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర. భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబించనున్నాయి. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశంతో పాటూ ఏఏ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను రూపొందించింది.

Viksit Bharat Sankalp Yatra: ప్రధాని మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర గురించి తెలుసా.. దీని వల్ల కలిగే ప్రయోజనం ఇదే..
Pm Modi Launches Viksit Bharat Sankalp Yatra, Know Details
Srikar T
|

Updated on: Nov 25, 2023 | 8:58 PM

Share

కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర. భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబించనున్నాయి. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశంతో పాటూ ఏఏ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను రూపొందించింది. దీనిని నవంబర్ 15వ తేదీన ఆదివాసీ గౌరవ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీయే జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా వేదిక అయింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు విస్తరించేలా షెడ్యూల్‌ను రూపొందించారు అధికారులు. ఈ యాత్ర దేశంలోని 24రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటూ కేంద్రపాలిత ప్రాంతాల్లో సాగుతుంది. దేశ వ్యాప్తంగా 8,500 పై చిలుకు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గడిచిన పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాలను గ్రామస్థాయిలో వివరించేందుకు ప్రత్యేకంగా ఐదు ఐసీఈ వ్యాన్లను ఏర్పాటు చేశారు. ఈ వ్యాన్‌లు జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయితీల్లో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమాలపై ప్రచారాన్ని అందిస్తాయి. ఇప్పటికే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ ప్రారంభమైంది.

ఉద్దేశం ఇదే..

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది. వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన కారణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరించనున్నారు. ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

2023 నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆదివాసీ గౌరవ్ దివస్ నాడు ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం (2024 జనవరి 26) వరకూ కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖలు మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. ఈ యాత్రను విజయవంతం చేయడానికి మరికొన్ని కీలక మంత్రిత్వ శాఖలు ప్రత్యేకంగా చొరవ చూపిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..