Modi on BJP: మ్యాజిక్‌ ఫిగర్‌ స్థానాల్లో పోటీ చేయలేని పార్టీలు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తాయిః మోదీ

దేశ ప్రజలంతా ఇప్పుడు దేశ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల గురించి, ప్రధానిగా ఎవరిని ఎంచుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారో మోదీ క్లారిటీ ఇచ్చారు. ఒక్క తెలంగాణలోనే కాదు యావత్ దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందంటున్నారు ప్రధాని మోదీ. ఇండియా కూటమి ఇబ్బందుల్లో ఉందని, కనీసం ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉందంటున్నారు.

Modi on BJP: మ్యాజిక్‌ ఫిగర్‌ స్థానాల్లో పోటీ చేయలేని పార్టీలు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తాయిః మోదీ
Pm Modi
Follow us
Balaraju Goud

|

Updated on: May 03, 2024 | 7:39 AM

దేశ ప్రజలంతా ఇప్పుడు దేశ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల గురించి, ప్రధానిగా ఎవరిని ఎంచుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారో మోదీ క్లారిటీ ఇచ్చారు. ఒక్క తెలంగాణలోనే కాదు యావత్ దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందంటున్నారు ప్రధాని మోదీ. ఇండియా కూటమి ఇబ్బందుల్లో ఉందని, కనీసం ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉందంటున్నారు. అంతేకాదు. బీజేపీ తప్ప 272 సీట్లలో ఏ ఒక్క పార్టీ కూడా పోటీ చేయడం లేదన్నారు. అలాంటప్పుడు వారికి ఎలా కేంద్రంలో అధికారం వస్తుందని ప్రశ్నిస్తున్నారు మోదీ.

టీవీ9 నెట్‌వర్క్‌‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ రాజకీయాల్లో ఈసారి మీ పార్టీ ప్రదర్శన ఎలా ఉండబోతోందనే విషయాన్ని మోదీ స్పష్టం చేశారు. మొదట చెప్పుకోవాల్సింది లోక్‌సభ ఎన్నికల గురించి, దేశమంతా రాబోయే ప్రభుత్వం ఎవరదీ అని ఎదురు చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో రాజనీతి అన్నది బాగా ఉన్నతస్థితికి వెళ్లింది. 2024లో జరుగుతున్న ఎన్నికల విషయంలో జనం ఆసక్తిగా ఉన్నారు. దేశ భవిష్యత్తు గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రధాని ఎవరు అని ఆలోచిస్తున్నారు. దీనిపైనే దృష్టి కేంద్రీకరించారు. ఈ విషయంలో ఇండియా కూటమి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకూ ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకు కూటమి దగ్గర సమాధానం లేదు. బీజేపీ కాకుండా ఏ ఒక్క పార్టీ కూడా 272 స్థానాల్లో పోటీ చేయడం లేదు. 272 సీట్లలో పోటీ చేయనపుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు.

దేశంలో బీజేపీని మించిపోయే పార్టీ ఈ ఎన్నికల్లో ఏదీ లేదంటున్నారు ప్రధాని మోదీ. కనీసం మ్యాజిక్‌ ఫిగర్‌ స్థానాల్లో పోటీ కూడా చేయలేని పార్టీలు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తాయనేది మోదీ ప్రశ్న.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!