PM Modi TV9 Interview: నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: ప్రధాని మోదీ

టీవీ9 నెట్‌వర్క్‌ ఫైవ్‌ ఎడిటర్స్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై విపక్ష నేతలందరినీ ప్రధాని మోదీ సూటిగా ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొందరికి ఏటీఎంగా మారిందని.. మళ్లీ తెలంగాణ ఏటీఎంగా తయారైందన్నారు. అంతటా అవినీతి వ్యవహారం ఉంది.

PM Modi TV9 Interview: నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: ప్రధాని మోదీ
Pm Modi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 03, 2024 | 7:17 AM

టీవీ9 నెట్‌వర్క్‌ ఫైవ్‌ ఎడిటర్స్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై విపక్ష నేతలందరినీ ప్రధాని మోదీ సూటిగా ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొందరికి ఏటీఎంగా మారిందని.. మళ్లీ తెలంగాణ ఏటీఎంగా తయారైందన్నారు. అంతటా అవినీతి వ్యవహారం ఉంది. కమీషన్ ఇవ్వనిదే ఏదీ వదిలిపెట్టడం లేదు.. 25 ఏళ్లుగా దేశానికి తాను కీలక నేతగా ఉన్నానని, కానీ ఏనాడు దిగజారుడు రాజకీయాలు చేయలేదని చెప్పారు. రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఒక్క మచ్చ కూడా లేదన్నారు. దృఢమైన సంకల్ప శక్తి ఉంటేనే నిజాయితీగా రాజకీయాలు చేయవచ్చని ప్రధాని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం టీవీ 9 5 ఎడిటర్స్ కార్యక్రమంలో దేశరాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రాల స్థానిక రాజకీయాల కంటే ఎంతో ఉన్నతంగా నిలిచాయని ప్రధాని అన్నారు. ఇది మంచి విషయమే. 2014, 2019లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈసారి ఎన్నికలు నేరుగా ప్రధానిపైనే ఫోకస్ చేశాయి. మీ ప్రధాని ఎవరు అని ప్రజలు అడుగుతున్నారు,..? ఒక్క పార్టీ కూడా 272 స్థానాల్లో పోటీ చేయడం లేదు. అందుకే వన్ ఇయర్ వన్ పీఎం అనే ఫార్ములా తీసుకున్నారు అంటూ విమర్శించారు. అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. బెంగాల్‌లో కూడా నోట్ల కట్టల రాజ్యం కనిపిస్తుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..