AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సందేశ్‌ఖాలీ బాధిత మహిళలను చూసిన ఉద్వేగానికిలోనై ప్రధాని నరేంద్ర మోదీ

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ కేసుకు సంబంధించి తొలిసారిగా స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆరోజు జరిగిన ఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సందేశ్‌ఖాలీలో ఘోర పాపం జరిగిందని, అది సహించరానిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సందేశ్‌ఖాలీ బాధితులను కలిసిన ప్రధాని వారిని ఓదార్చారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు ప్రధాని.

PM Modi: సందేశ్‌ఖాలీ బాధిత మహిళలను చూసిన ఉద్వేగానికిలోనై ప్రధాని నరేంద్ర మోదీ
Pm Modi Emotional
Balaraju Goud
|

Updated on: Mar 06, 2024 | 1:44 PM

Share

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ కేసుకు సంబంధించి తొలిసారిగా స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆరోజు జరిగిన ఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సందేశ్‌ఖాలీలో ఘోర పాపం జరిగిందని, అది సహించరానిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సందేశ్‌ఖాలీ బాధితులను కలిసిన ప్రధాని వారిని ఓదార్చారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు ప్రధాని.

తన పశ్చిమ బెంగాల్ పర్యటనలో సందేశ్‌ఖాలీ సమీపంలోని బరాసత్‌లో జరిగిన నారీ శక్తి వందన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సందేశ్‌ఖాలీలో ఘోరమైన పాపం జరిగింది. అక్కడ ఏమి జరిగినా ఎవరైనా సిగ్గుతో తల దించుకుంటారు. కానీ అక్కడ TMC ప్రభుత్వం మీ కష్టాలు పట్టింపు లేదు. బెంగాల్ మహిళల దోషిని రక్షించడానికి TMC ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మొదట హైకోర్టు నుండి తరువాత సుప్రీం కోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలోనే వారికి శిక్ష పడేలా చూస్తాం” అని అన్నారు ప్రధాని మోదీ.

TMC ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు ప్రధాని మోదీ. బెంగాల్ మహిళలకు టీఎంసీ ప్రభుత్వంలో రక్షణ కరువైందన్నారు. బెంగాల్ మహిళలు, దేశ మహిళలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళల కేవలం సందేశ్‌ఖాలీకే పరిమితం కావడం లేదు. టిఎంసీ మాఫియా పాలనను అంతం చేయడానికి బెంగాల్ మహిళా శక్తి ముందుకు వచ్చిందని, భారతీయ జనతా పార్టీ మాత్రమే బెంగాల్ మహిళలకు రక్షణ నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

బుజ్జగింపులు, ప్రభావశీలుల ఒత్తిడిలో పనిచేస్తున్న TMC ప్రభుత్వం, సోదరీమణులు, కుమార్తెలకు భద్రత కల్పించదన్నారు మోదీ. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసింది. అత్యాచారం కేసులో మరణశిక్ష తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. కష్ట సమయాల్లో మహిళలు ఫిర్యాదు చేయడానికి హెల్ప్‌లైన్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. TMC ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడానికి అనుమతించడం లేదని మండిపడ్డారు ప్రధాని.

మోదీకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, భారతీయ తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు రక్షించడానికి కవచంలా నిలుస్తున్నారని, కష్టకాలంలో సోదరీమణులు, కూతుళ్లకు రక్షణ కవచంగా నిలుస్తానని నరేంద్ర మోదీ అన్నారు. నేడు ప్రతి భారతీయుడు తనను మోదీ కుటుంబం అని పిలుచుకుంటున్నారన్నారు. దేశంలోని ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి యువకుడు, ప్రతి మహిళ నేనే ‘మోదీ కుటుంబం’ అని చెప్తున్నారన్నారు.