AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యుడిపై నల్ల మచ్చ.. టెన్షన్‌లో శాస్త్రవేత్తలు.. మరో మూడు నెలలు.!

ఎండలు మండిపోతున్నాయిరా బాబూ! మార్చి నెల వచ్చిందో లేదో.. అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు క్రమంగా వేడి పెరుగుతోంది. బయటకు వెళ్లి ఇంటికి రాగానే.. అయితే ఫ్యాను.. లేదంటే ఏసీ ఆన్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి.

సూర్యుడిపై నల్ల మచ్చ.. టెన్షన్‌లో శాస్త్రవేత్తలు.. మరో మూడు నెలలు.!
Maxresdefault (2)
Gunneswara Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 07, 2024 | 10:28 AM

Share

ఎండలు మండిపోతున్నాయిరా బాబూ! మార్చి నెల వచ్చిందో లేదో.. అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు క్రమంగా వేడి పెరుగుతోంది. బయటకు వెళ్లి ఇంటికి రాగానే.. అయితే ఫ్యాను.. లేదంటే ఏసీ ఆన్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి.. ఏప్రిల్, మే.. ఇంకా జూన్ నెలల్లో సీన్ ఎలా ఉండబోతోంది? ఈసారి మాత్రం నెత్తి మాడిపోయేలా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి తోడు.. సూర్యుడిపై నల్ల మచ్చ శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతోంది. జూన్ లోపు దాని ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించడానికే ఆందోళన చెందేంతగా ఆ ప్రభావం ఉంది. సూర్యుడు భగభగలాడుతాడు అని తెలుసు. కానీ సూర్యప్రతాపం తీవ్రమైతే దానిని తట్టుకోవడం భూమిపై ఏ జీవి వల్లా కాదు. వేసవిలో టెంపరేచర్లను తట్టుకోలేకే చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటిది ఈసారి జూన్ నెలలోపే సోలార్ మాగ్జిమమ్ ఉంటుందంటున్నారు. ఇంతకీ దీనివల్ల వచ్చే కష్టమేంటి? నష్టమేంటి? ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గమేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

సూర్యుడిపై ఫిబ్రవరి 18న ఓ మచ్చ కనిపించింది. అయితే ఏంటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. అప్పుడే అది 3 సార్లు జ్వాలను రగిలించింది. దీని దెబ్బకు హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు ఇబ్బంది తప్పలేదు. కాకపోతే కరోనల్ ఎజెక్షన్స్ లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి చివరి వారంలో ఈ మచ్చ.. దాని సైజులో 25 శాతం పెరిగిపోయింది. దీంతో భూమిపై రచ్చ మొదలైంది. ఎందుకంటే ఈ మచ్చ సైజు ఎంత ఉంటుందో తెలుసా.. మన భూమిలాంటి గ్రహాలను దాదాపు 9 కలిపితే ఎంత సైజు ఉంటుందో.. ఆ మచ్చ కూడా అంతే సైజుంది. ఇప్పుడు 25వ సౌర చక్రం ఉంది. ఇది 2019లో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే పెద్ద సైజు మచ్చ. దీనికి AR3590 అని పేరు పెట్టారు. AR అంటే యాక్టివ్ రీజియన్. అంటే సూర్యుడిలో ఏ ప్రాంతమైతే క్రియాశీలకంగా ఉంటుందో దానిని ఇలా పిలుస్తారు. నిజం చెప్పాలంటే భానుడిపై నల్ల మచ్చలు అసాధారణమేం కాదు. అక్కడ సౌర జ్వాలలూ కొత్తేం కాదు. కాకపోతే ఇలాంటి మచ్చలు.. కచ్చితంగా సౌరవ్యవస్థలో గ్రహాలపై.. ఎఫెక్ట్ చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతారు.