AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సగం గడ్డం చేసి వదిలేసిన సెలూన్ షాప్ నిర్వాహకుడు.. ఎందుకో తెలుసా..?

అర గుండు, అర మీసం తీసేసిన సందర్భాలు చాలా చూశాం..! కానీ ఇదేంటి సగం గడ్డం చేసి వదిలేయడం ఏంటనీ అనుకుంటున్నారా..? అచ్చం ఇదే జరిగింది. కాంగ్రెస్, వైసీపీ నాయకుల మధ్య గత కొంతకాలంగా పాత గొడవలు ఉన్నాయి. దీంతో ఒకరికొకరు ఎదురుపడితే కారాలు, మిరియాలు నూరుకునే పరిస్థితి. తీరా ఒక రోజు ఒకరికి పగ తీర్చుకునే సమయం రానే వచ్చిందని అనుకున్నాడు. ఇద్దరూ ఎదురెదురు పడ్డారు.

Andhra Pradesh: సగం గడ్డం చేసి వదిలేసిన సెలూన్ షాప్ నిర్వాహకుడు.. ఎందుకో తెలుసా..?
Half Shaving
Nalluri Naresh
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 06, 2024 | 3:50 PM

Share

అర గుండు, అర మీసం తీసేసిన సందర్భాలు చాలా చూశాం..! కానీ ఇదేంటి సగం గడ్డం చేసి వదిలేయడం ఏంటనీ అనుకుంటున్నారా..? అచ్చం ఇదే జరిగింది. కాంగ్రెస్, వైసీపీ నాయకుల మధ్య గత కొంతకాలంగా పాత గొడవలు ఉన్నాయి. దీంతో ఒకరికొకరు ఎదురుపడితే కారాలు, మిరియాలు నూరుకునే పరిస్థితి. తీరా ఒక రోజు ఒకరికి పగ తీర్చుకునే సమయం రానే వచ్చిందని అనుకున్నాడు. ఇద్దరూ ఎదురెదురు పడ్డారు. అదీ కూడా సెలూన్ షాపులో.. గడ్డం చేయించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతను చూశాడు వైసీపీ నేత.

ఇంకేముంది సరిగ్గా దొరికాడు అనుకున్నాడో ఏమో? తన ప్రత్యర్థికి గడ్డం చేయొద్దని సెలూన్ షాప్ నిర్వాహకునికి వైసీపీ నాయకుడు హుకుం జారీ చేశాడు. దీంతో సెలూన్ షాప్ నిర్వాకుడు సగం గడ్డం చేసి వదిలేసాశాడు. ఈ అనుహ్య ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటరమణ, వైసీపీ నేత శ్రీరాములు మధ్య గత కొంతకాలంగా పాత గొడవలు నడుస్తున్నాయి. షేవింగ్ చేయించుకునేందుకు సెలూన్ కి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటరమణతో వైసీపీ నేత శ్రీరాములు మరోసారి గొడవపడ్డాడు.

ఇంకేముంది వెంకటరమణకు గడ్డం చేయొద్దని సెలూన్ షాప్ నిర్వాహకుడికి వార్నింగ్ ఇచ్చాడు వైసీపీ నేత శ్రీరాములు. దీంతో ఇద్దరి మధ్య గొడవలో నేనెందుకు అనుకున్నాడో ఏమో సెలూన్ షాప్ నిర్వాహకుడు సగం గడ్డం చేసి వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో సగం గడ్డం పంచాయతీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. సగం గడ్డంతోనే వెంకటరమణ స్టేషన్ కు వెళ్లాడటం అందరినీ షాక్‌కు గురి చేసింది. తనను సగం గడ్డంతో అవమానించి, దౌర్జన్యానికి పాల్పడ్డాడని శ్రీరాములపై వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…