AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake on Tree: ఇదో విచిత్రం.. ప్రతి రోజు చెట్టుపై దర్శనమిస్తున్న నాగుపాము..

ఎక్కడైనా పాములు కనిపించకుండా తిరగడంతోపాటు పొదలు, రహస్య ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ఏడాది నుంచి నాగుపాము పొలంలో తిరుగుతూ చెట్టుపై ఎక్కి తిష్టవేసింది. ఆ ఊరిలోకి వచ్చిన నాగుపాము నిత్యం ప్రజలకు దర్శనమిస్తుంది. వచ్చి పోయే వారిని గమనిస్తూ ఉంటుంది.

Snake on Tree: ఇదో విచిత్రం.. ప్రతి రోజు చెట్టుపై దర్శనమిస్తున్న నాగుపాము..
King Cobra Ssnake On Tree
P Shivteja
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 06, 2024 | 12:45 PM

Share

ఎక్కడైనా పాములు కనిపించకుండా తిరగడంతోపాటు పొదలు, రహస్య ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ఏడాది నుంచి నాగుపాము పొలంలో తిరుగుతూ చెట్టుపై ఎక్కి తిష్టవేసింది. ఆ ఊరిలోకి వచ్చిన నాగుపాము నిత్యం ప్రజలకు దర్శనమిస్తుంది. వచ్చి పోయే వారిని గమనిస్తూ ఉంటుంది. దీన్ని చూసిన జనం ఏకంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ విచిత్రమైన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజిరం పేట, కూకుట్లపల్లి గ్రామాల శివారులోని పొలంలో దర్శనమిస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేకనో.. లేక ప్రజలకు విచిత్రంగా కనిపించాలన్న ఉద్దేశంతోనే వారం రోజుల నుంచి పొలంలోని వచ్చిన నాగుపాము చెట్టుపై తిష్టవేసింది. ప్రతి రోజు పాము పడగ విప్పి దర్శనమిస్తుంది.

భుజిరం పేట గ్రామ శివారులో మెయిన్ రోడ్ పక్కన 14 ఎకరాల మామిడి తోటలో నాగు పాము కనిపిస్తుందని గ్రామస్తులు తెలిపారు. భుజిరం పేట గ్రామానికి చెందిన కర్నే హరీష్ రెడ్డి ప్రతిరోజు పొలంలో పనిచేస్తూ పాముతో ఉంటూ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లి పోతున్నాడు. ఏడాది నుంచి ప్రతిరోజు పొలంలోనే తిరుగుతూ చెట్టుపైకి ఎక్కి దర్శనమిస్తుంది. సాయంత్రం కాగానే యధావిధిగా చెట్టు దిగి వెళ్లిపోయేది నాగుపాము. ఒక రోజు పంట రక్షణ కోసం పెట్టిన వలలో నాగుపాము చిక్కిపోగా కర్నే హరీష్ రెడ్డి పామును వలలో నుంచి విడిపించి వదిలేశాడు. దీంతో నాగుపాము పక్కనే అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది.

అయితే ప్రతిరోజు సాయంత్రం పొలంలోకి వచ్చి చెట్టుపైకి కూర్చుటోంది నాగుపాము. చెట్టు ఎక్కి పడగవిప్పి గంటసేపు దర్శనం ఇచ్చి సాయంత్రం కాగానే మళ్లీ యధావిధిగా వెళ్ళిపోతుంది..తోటలో పనిచేస్తున్న కర్నే హరీష్ రెడ్డి పామును చూసి వేసవి ఉన్నందున పచ్చని పొలంలో చెట్ల మధ్య ఉంటుందని, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తోటలోకి గ్రామానికి చెందిన మహిళా కూలీలు చూసి చెట్టుపై పడగతో దర్శనమిస్తున్న నాగుపాముకు మొక్కుతూ వెళ్ళిపోతున్నారు. చెట్ల పొదల్లో, పుట్టల్లో ఉండాల్సిన పాము.. ఇలా జనం మధ్యకు వచ్చి వస్తుండటం వింతగా ఉందని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పాము ఇప్పటివరకు ఎవరికి హాని తలపెట్టలేదని స్థానికులు చెబుతున్నారు..

నాగుపాము వీడియోను మీరే చూసేయండి…

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..