Forbes list: ఫోర్బ్ జాబితాలో రైతు బిడ్డ.. ఆఫీషియల్ ఎగ్జిక్యూటివ్‌గా తెలంగాణ వాసికి చోటు..!

ఫోర్బ్ జాబితాలో సంచలన నమోదైంది. ఓ బిడ్డకు అసమాన స్థానం దక్కింది. ఆఫీషియల్ ఎగ్జిక్యూటివ్‌ ఫోర్బ్ జాబితా తెలంగాణకు చెందిన చింతం నరేందర్‌కు చోటు లభించింది. మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తికి ప్రపంచ గుర్తింపు దక్కింది. అతి పిన్న వయసులోనే అత్యున్న శిఖరాలకు ఎదిగారు కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్.

Forbes list: ఫోర్బ్ జాబితాలో రైతు బిడ్డ.. ఆఫీషియల్ ఎగ్జిక్యూటివ్‌గా తెలంగాణ వాసికి చోటు..!
Narendar In Forbes
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Mar 06, 2024 | 10:43 AM

ఫోర్బ్ జాబితాలో సంచలన నమోదైంది. ఓ బిడ్డకు అసమాన స్థానం దక్కింది. ఆఫీషియల్ ఎగ్జిక్యూటివ్‌ ఫోర్బ్ జాబితా తెలంగాణకు చెందిన చింతం నరేందర్‌కు చోటు లభించింది. మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తికి ప్రపంచ గుర్తింపు దక్కింది. అతి పిన్న వయసులోనే అత్యున్న శిఖరాలకు ఎదిగారు కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి అనే మారుమూల గ్రామంలొ మద్యతరగతి వ్యవసాయ కుటుంబంలో చింతం రాములు కనకలక్ష్మి దంపతులకు జన్మించాడు. బాల్యం అంతా విద్యాభ్యాసం శ్రీ సరస్వతీ శిశుమందిర్ LMD కాలనీలో చేసి మధ్యమ స్థాయి ఇంటర్ నుండి డిగ్రీ వరకు కరీంనగర్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత 2007లో హైదరాబాద్‌లో ఎంబీఏ డిగ్రీ అందుకున్నాడు. కొన్ని రోజులు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్య గం సంపాదించాడు. అతి కొద్దికాలంలోనే అమెరికా, ఇటలీ , జర్మనీ, బ్రిటన్, స్కాట్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలు వృత్తిరీత్యా పర్యటించి, అతికొద్ది సమయంలోనే ఎక్కువ దేశాలు తిరిగిన సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా పేరు సంపాదించారు.

2015లో అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న నరేందర్.. అక్కడే తన సృజనాత్మకను ప్రపంచానికి తెలిసేలా చేశారు. అమెరికా వెళ్లిన తర్వాత రీసెర్చ్ చేసి సుమారు 55 ఇన్నోవేటివ్ పేటెంట్లను పబ్లిష్ చేశారు. దానితో పాటు అనేక ప్రపంచస్థాయి కాన్పెరెన్సులకు కీ నోట్ స్పీకర్‌గా వ్యవహరించారు. పదకొండు ప్రపంచ స్థాయి జర్నల్ సంస్థలకు చీఫ్ ఎడిటర్‌గా పని చేస్తూ, సుమారు 160 ప్రపంచ స్థాయి జర్నల్స్ ప్రచురించి అనేక విద్యాసంస్థలకు టెక్నికల్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యున్నత విద్యాసంస్థ అయిన MIT కేంబ్రిడ్జ్ నుండి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా పొందారు నరేందర్.

అత్యంత తక్కువ సమయంలో కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇన్నోవేషణ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో సీనియర్ ఎంటర్‌ప్రైజెస్ ఆర్కిటెక్ట్ స్థానాన్ని సంపాదించారు. అనేక ఇన్నోవేటివ్ జర్నల్స్ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మకమయిన ఫోర్భ్స్ జర్నల్‌లో అఫియల్ ఎగ్జిక్యూటివ్‌గా స్థానం సంపాదింగలిగారు. ఇటీవల దేశరాజదాని న్యూఢిల్లీ విధాన సభ స్పీకర్ చేతుల మీదుగా అత్యంత అరుదైన భారత సమ్మాన్ నిధి అవార్డును టాప్ టెన్ రేసర్‌గా ఎక్కువ రీసర్చ్ అండ్ ఇన్నోవేటివ్ పేటెంట్స్ కలిగిన వ్యక్తిగా విధాన సభ స్పీకర్ శ్రీరాం నివాస్ గోయల్ చేతుల మీదుగా అందుకున్నారు.

నరేందర్ రీసర్చ్‌లో కొన్ని ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇటెలిజెన్స్ ఆధారిత కళ్ళజోడు సృష్టించి, దానిలో పర్సనల్ వర్చువల్ అసిస్టెంట్‌ను జోడించారు. రోజువారి కార్యక్రమాలు మొత్తం ఆ వర్చువల్ అసిస్టెంట్ గైడ్ చెయ్యటం, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఎంతవరకు నిజం మాట్లాడుతున్నారు అని చెప్పడం క్యరెక్టర్ అనాలిసిస్ చేస్తుంది. చెవిలో తనకు కావల్సిసిన వార్తలు చదవడం, కల్లజోడు నుండి ప్రొజెటర్ ద్వారా ఎమైల్స్ చూపెట్టడం, రిపొర్ట్స్ చూపెట్టడం నావిగేషణ్ చూపెట్టడం, చుట్టు పక్కల ఎలాంటి షాప్స్ ఉన్నాయో వివరిస్తుంది. తనకేం ఏం అవసరం లాస్ట్ ఇయర్ ఎన్ని సార్లు ఆ షాప్ లో ఏం కొన్నరులాటి వివరాలతో పాటు, ట్రాఫిక్ అప్డేట్స్, ఇంట్లో సామాన్లు ఏం నిండుకున్నాయో తాను ఏం కొనాలో రిమైండ్ చేయనుంది ఈ డివైజ్.

అలాగే మనిషి ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన హెచ్చరికలు సైతం చేస్తుంది. తినే వస్తువువులల్లో క్యాలరీలు ఎంత వున్నాయో, క్యాలరీస్ క్యాల్కులేట్ చెసి చెప్పడం, బీపీ షుగర్ లాంటివి మానిటర్ చేసి అలర్ట్ చెయ్యడం, హెల్త్ ప్రొఫైల్, ఎమర్జెన్సీ కాల్స్, ఆటోమెటిక్ ఆంబులెన్స్ కాల్స్ చెయ్యడం, అత్యవసర పరిస్థిని వీడియో తీసి పోలీసులకు అందినచడం, ఎవరయి కొత్త వ్యక్తి కలినప్పుడు అతని సోషల్ ప్రొఫైల్‌నను అనలైస్ చేసి అతని వ్యక్తిత్వాన్ని అంచానా వేయడం, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చెయ్యడం, ఫినన్షియల్ అడ్వైస్ ఇవ్వడం ఎమైల్స్ కంపోస్ చేయ్యడం లాంటి, ప్రజెంటేషన్ AI ద్వారా ప్రిపేర్ చెయ్యడం లాంటి ఇన్నోవేటివ్ ఆవిష్కరణలు సృష్టించారు చింతం నరేందర్.

మహా ఏఐ అనే కంపెనీని స్థాపించి అనేక పరిశోదణలతో సుమారు ఆరు సంవత్సరాల కఠోర దీక్షతో ప్రోటోటైప్ చేసి లండన్, ఆస్ట్రేలియాతో పాటు ఇండియాలో పేటెంట్స్ పబ్లిష్ చేశాడు. అలాగే సోలార్ ఎనర్జీతో నడిచే వెహికల్స్, పొల్యూషణ్ ఫ్రీ AC బైకులు, క్లౌడ్ కంప్యూటరింగ్, IOT ఆర్కిటెక్చర్లలో అనేక సప్లయ్ చైన్ , యార్డ్ మెనేజ్‌మెంట్, ఆటోమాటిక్ డ్రోన్ రోబో, జీపీఎస్ ద్వారా ఆక్సిడెంట్ ప్రదేశానికి వెళ్ళి ప్రథమ చికిత్స రక్తం ఆగడానికి ఆక్సిజన్ మాస్క్ ఇచ్చే డ్రోన్ ఆవిష్కరణలు, ఎనిమిది విప్లవాత్మకమైన న్యూఅరల్ నెట్‌వర్క్, ఆర్టిఫియల్ ఇంటలెజెన్స్, రీసర్చ్ అండ్ ఇన్నోవేషణ్ పుస్తకాలు ప్రచురించి విశేష ఆదరణ పొందారు.

ఎనలేని ప్రతిభతో Street lights ద్వారా ఎనర్జీ సేవ్ చేయడానికి IOT ఆధారిత ఆబ్జెక్ట్ బేస్డ్ డిటెక్షణ్ ద్వారా కేవలం మనుషులు లేదా జంతువులు ఉన్నప్పుడు మాత్రమే వెలిగేలా స్ట్రీట్ లైట్లను అవిష్కరించారు. మిగతా టైంలో ఆఫ్ అయ్యే విధంగా ఉంటూ పక్కా స్ట్రీట్ లైట్ వెలగకపొతే ఆటోమెటిక్‌గా ఇంకో లైట్ టికెట్ క్రియేట్ చేసి ఈ కామర్స్ ద్వారా ఆటోమెటిక్‌గా ఆర్డర్ చేసి సంబంధిత అధికారికి నోటిఫై చెయ్యడం లాంటి అనేక విప్లవాత్మక పేటేంట్స్ సంపాదించడంతో పాటు, ఫారెస్ట్ లో మిషన్ లెర్నింగ్ ఆధారిత సీడ్ బాల్స్ డ్రోన్స్ ద్వారా వేయడం , జీవరాశుల సంఖ్యను బట్టి అడవులల్లో పండ్ల మొక్కలు వాటికి కావలిసిన ఆహారానికి సంబదించిన AI బేస్డ్ అనాలిస్స్ చేసి అక్కడ సీడ్ బాల్స్ వేయడం ఎక్కడెక్కడ విస్తృతంగా చెట్లు ఉన్నాయో చూసి అక్కడ పెరిగే చెట్లను సాయిల్ అనుకూలతలను బట్టి డ్రోన్ ద్వారా విరివిగా సీడ్ బాల్స్ వెయ్యడం లాంటి అనేక విషిష్ట సేవలకు రీసర్చ్ అండ్ ఇన్నోవేటివ్ సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులు అందుకున్నారు నరేందర్. ఇంతకు ముందు పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ , ఇండియన్ ఎమినెంట్ అవార్డు, అబ్దుల్ కలాం పురస్కార్ అవార్డ్ , ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు లాంటి పలు గౌరవ పురస్కారాలు అందుకున్నారు.

తాజాగా ఫోర్బ్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు నరేందర్. తమ గ్రామ యువకుడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం పట్ల మక్తపల్లిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నరేందర్‌ కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నరేందర్‌ తల్లిదండ్రులు అందరికీ స్వీట్స్ పంచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…