- Telugu News Photo Gallery Relationship Tips: habits that everyone should check about their partner before marriage
అమ్మాయిలూ, అబ్బాయిలు ఇది మీకే.. ఆ కార్యం కంటే ముందు ఈ విషయాలను తెలుసుకోండి..
Relationship Tips: ఇప్పడున్న పరిస్థితుల్లో.. ఏ వ్యక్తితోనైనా కొంత కాలం జీవించడం, ఆ వ్యక్తితో జీవితాంతం గడపడం అనే తేడాను గమనించాలి.. మీరు కొంతకాలం ఎవరితోనైనా రిలేషన్ లో ఉండి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే.. ఇది మీ జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం కావచ్చు. దీనికి బదులుగా, ముందుగా మీరు మీ భాగస్వామిలో కొన్ని విషయాలను తనిఖీ చేయాలి.
Updated on: Mar 06, 2024 | 10:36 AM

వివాహం అనేది జీవితంలో అతిపెద్ద నిర్ణయం.. ఈ విషయంలో అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. ఎక్కువగా ఆలోచించి ముందడుగు వేయాలి.. కొంచెం తేడా వచ్చినా.. అది మొత్తం జీవితంపై ప్రభావితం చూపుతుంది. కానీ, ఇదివరకటి రోజుల్లో పెళ్ళి అనేది పెద్దల నిర్ణయాలను బట్టి ఉండేది.. కానీ ఇప్పుడు అలా లేదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. యువతి, యువకుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. వైవాహిక జీవితానికి ముందు.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అయితే, పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం సవాలుగా ఉంటుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే లేదా కొంతకాలంగా ఎవరితోనైనా ఆకర్షితులైతే.. వెంటనే.. పొరపాటున కూడా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకోకండి. మీరు మీ భాగస్వామిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, దానికి ముందు కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం..

ఇప్పడున్న పరిస్థితుల్లో.. ఏ వ్యక్తితోనైనా కొంత కాలం జీవించడం, ఆ వ్యక్తితో జీవితాంతం గడపడం అనే తేడాను గమనించాలి.. మీరు కొంతకాలం ఎవరితోనైనా రిలేషన్ లో ఉండి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే.. ఇది మీ జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం కావచ్చు. దీనికి బదులుగా, ముందుగా మీరు మీ భాగస్వామిలో కొన్ని విషయాలను తనిఖీ చేయాలి. మీ భాగస్వామి ఇక్కడ పేర్కొన్న ఏవైనా అలవాట్లలో పాలుపంచుకున్నట్లయితే, వెంటనే అతనికి దూరంగా ఉండటం మంచిది.. ఎందుకో ఈ కింది విషయాలను తెలుసుకోండి..

భాగస్వామి బిహేవియర్: మీ భాగస్వామికి మీ కంటే ఎక్కువ డబ్బు ఉంటే, అతను మీ పట్ల ఎక్కువ ఆసక్తి, ఫీలింగ్ కనబర్చాల్సిన అవసరం లేదు. కొందరికి మొదటినుండి ఫీలింగ్ చూపించే అలవాటు ఉంటుంది.. అలాంటి వారిని మీరు గుర్తించాలి. అలాంటి వ్యక్తులు తమ కీర్తి కోసం ఏ మలుపులోనైనా మిమ్మల్ని ఒంటరిగా వదిలివేయవచ్చు. మీ భాగస్వామికి చులకనగా చూసే అలవాటు ఉంటే, మీరు మీ జీవితమంతా అలాంటి వ్యక్తితో గడపగలరా అని ముందుగానే ఆలోచించండి..

ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పడం: అబద్ధం చెప్పే అలవాటు ఎవరికీ నచ్చదు. మీ భాగస్వామి ప్రతి విషయంలో మీతో అబద్ధాలు చెప్పినా లేదా మీకు విషయాలు చెప్పడానికి సంకోచించినా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు అలాంటి వ్యక్తిని ఎప్పటికీ విశ్వసించలేరు. ఈ విధంగా, మీ సంబంధం రోజురోజుకు బలహీనపడుతుంది.. ఏదో ఒక రోజు విడిపోయే అవకాశం ఉండవచ్చు.

మీ గురించి మాత్రమే ఆలోచించడం - మాట్లాడటం: కొంతమందికి తమ గురించి మాత్రమే మాట్లాడే అలవాటు ఉంటుంది. వారు ఏదైనా విషయంలో తమ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తి మీకు ఎప్పటికీ మద్దతు ఇవ్వొద్దు. నిత్యం తనను తాను పొగుడుతూనే బిజీగా ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.




