- Telugu News Photo Gallery Cinema photos Venkatesh to Salaar Part 2 Shouryanga Parvam latest movie updates from tollywood film industry
Movie Updates: వెంకీ సరసన ఆ క్రేజీ బ్యూటీ.. త్వరలోనే సెట్స్ పైకి శౌర్యంగ పర్వం..
వెంకటేష్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన పనులు చక చకా జరిగిపోతున్నాయి. గీతా ఆర్ట్స్‌లో కొత్త వాళ్లకు ఎప్పుడూ అవకాశాలు ఇస్తూనే ఉంటారు. సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ సీక్వెల్‌కు రెడీ అవుతున్నారు. జైలర్ సినిమా సక్సెస్‌లో తన భాగస్వామ్యం కూడా చాలా ఉందంటున్నారు మిల్క్ బ్యూటీ తమన్నా. విభిన్నమైన సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి 'మా కాళీ' అనే సినిమా వస్తుంది.
Updated on: Mar 06, 2024 | 10:14 AM

వెంకటేష్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన పనులు చక చకా జరిగిపోతున్నాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్‌ను ఫైనల్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి, నెక్ట్స్ మూవీలో వెంకీకి జోడిగా నటించబోతున్నారు.

గీతా ఆర్ట్స్‌లో కొత్త వాళ్లకు ఎప్పుడూ అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు అంజి తెరకెక్కిస్తున్న సినిమాకు ఆయ్ అనే టైటిల్ ఖరారు చేసారు. నార్నె నితిన్, హారిక ఇందులో జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల చేసారు.

సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ సీక్వెల్‌కు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కు రావటంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ముందు యాక్షన్ సీన్స్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

జైలర్ సినిమా సక్సెస్‌లో తన భాగస్వామ్యం కూడా చాలా ఉందంటున్నారు మిల్క్ బ్యూటీ తమన్నా. ఈ సినిమాలో తమన్నా చేసిన కావలయ్య సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. సినిమా రిలీజ్‌కు ముందే రికార్డ్ వ్యూస్ సాధించింది ఈ సాంగ్. కావలయ్య పాట విజయం సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్ ప్లే చేసింది అంటున్నారు తమన్నా.

విభిన్నమైన సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి 'మా కాళీ' అనే సినిమా వస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలైంది. భారత దేశంలోని బెంగాల్లో చెరిపి వేయబడిన ఒక చరిత్రను సంబంధించిన అంశాలను చూపించబోతున్నట్లుగా ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. సెన్సిటివ్ పాయింట్స్‌తోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు విజయ్ ఏలకంటి.




