- Telugu News Photo Gallery Cinema photos How much did Ram Charan take to dance with the Khans at Anant Ambani's pre wedding event?
Ram Charan: ఖాన్స్ తో కాలు కదపడానికి చెర్రీకి ఎంతిచ్చారు.? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రస్తుతం దేశం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకకు హాజరైన బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గున్నారు. ఈ వేడుకపై రోజుకు ఒక న్యూస్ సోషల్ మీడియా వైరల్ గా మారుతుంది. ఇప్పుడు తాజాగా మరో వార్త చెక్కర్లు కొడుతుంది. అందేంటి.? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 06, 2024 | 9:47 AM

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనం జరిగింది. ఈ వేడుక దేశ విదేశ ప్రముఖులతో పాటు చాలామంది సినీ ప్రముఖులు కూడా పాల్గున్నారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రిటీస్.

అంబానీ ఇంట జరిగిన వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ఆమీర్‌ఖాన్. ఈ ముగ్గురూ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి నాటు నాటు పాటకు వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో వారితో పాటు స్టేజ్ మీద టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ కూడా కాలు కదిపారు.

ఇందుకు గానూ ఈ బడా స్టార్లు ఎంత చార్జి చేశారో తెలుసా? అంటూ నార్త్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. అంత వైభవంగా జరిపిన వేడుకకు ఆహ్వానం అందడమే గొప్పగా భావించారు సెలబ్రిటీలు.

వైభవంగా జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గున్న సినిమా స్టార్ హీరోస్, ప్రముఖులు అంతా కూడా వారి ఇష్టపూర్వకంగానే కాలు కదిపారే తప్ప, ఏదో డబ్బు కోసం ఎవ్వరు చెయ్యలేదు అన్నది ప్రముఖుల్లో గట్టిగా వినిపిస్తున్న మాట.

రామ్‌చరణ్ కూడా సరదాగానే స్టెప్పులు వేశారట. ముగ్గురు ఖాన్‌లూ, చరణ్ వేసిన స్టెప్పులు వైరల్ కావడంతో వెంటనే ఎంత తీసుకున్నారు? ఎంత ఇచ్చి ఉంటారనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఆ మాటలకు అర్థం లేదంటూ కొట్టిపారేస్తున్నారు నార్త్ క్రిటిక్స్.




