- Telugu News Photo Gallery Cinema photos Venkat Prabhu checks the news that Vijay Thalapathy Greatest Of All Time movie is a Hollywood remake
GOAT Movie: ఈ సినిమా మీరు అనుకున్నట్టు కాదు.. విజయ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసిన వెంకట్ ప్రభు..
విజయ్ దళపతి హీరోగా వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న కోలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనిపై కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతాయి. వీటిపై తాజాగా స్పందించారు చిత్రం దర్శకుడు వెంకట్ ప్రభు. అసలు ఆ వార్తలు ఏంటి.? వాటిపై ఆయన రిప్లై ఏంటి.? విజయ్ అభిమానులకు దర్శకుడు ఎం చెప్పారు.? తెలుసుకుందాం రండి...
Updated on: Mar 06, 2024 | 9:12 AM

దళపతి విజయ్ హీరోగా వెంకట్‌ప్రభు డైరక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే పేరు పెట్టారు. సింపుల్‌గా గోట్ అని కూడా పిలుస్తున్నారు. ఈ సినిమా ఓ ప్రముఖ హాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే అందులో నిజం లేదని అంటున్నారు చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు. కంప్లీట్‌గా ఒరిజినల్ క్రియేషనే అని, దళపతి అభిమానులను ఫుల్ ఖుషీ చేసే ప్రాజెక్ట్ అని అన్నారు వెంకట్ ప్రభు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల జరుగుతున్నాయని అయన వెల్లడించారు.

క్లైమాక్స్, ఫారిన్ షెడ్యూల్ మాత్రం చిత్రీకరించాల్సి ఉంది. విజయ్ ఇచ్చే కాల్షీట్లను బట్టి అది ఎప్పుడు పూర్తవుతుందో తెలుస్తుంది అన్నారు. సమ్మర్ కానుకగా మేలో అభిమానుల కోసం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, అజ్మల్, వైభవ్... అంటూ స్టార్ స్టడ్డెడ్ సినిమాగా తెరకెక్కుతోంది గోట్. యువన్ సంగీతం అందిస్తున్నారు. ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ దీనికి నిర్మాతలు.

మీనాక్షి చౌదరి ఈ సినిమా విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో విజయ్ దళపతి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుంది. దీని తర్వాత మరి కొన్ని సినిమాలు చేయనున్నారు విజయ్. వీటి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తుంది.




