- Telugu News Photo Gallery Cinema photos Sara Ali Khan's Ae watan mere watan movie trailer released telugu movie news
Sara Ali Khan: సరికొత్త దారిలో సైఫ్ కూతురు.. అద్భుత నటనతో కట్టిపడేస్తోన్న సారా అలీ ఖాన్..
బ్రిటిన్ పాలనలో దేశవ్యాప్తంగా వార్తలను ప్రచారం చేసిన ధీర యువతి ఉషా రాణి నిజకథ. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తుండగా.. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. దేశభక్తి చిత్రంలో సారా నటించడం ఇదే మొదటిసారి. ఇందులో ఉషారాణి పాత్రలో అద్భుతమైన నటన కనబర్చింది సారా. ఈ సినిమాలో భుగర్భ రేడియో స్టేషన్ నడుపుతున్న స్వాతంత్ర సమరయోధురాలు 22 ఏళ్ల ఉషారాణి పాత్రను పోషించింది సారా.
Updated on: Mar 05, 2024 | 8:37 PM

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురిగా సినీరంగ ప్రవేశం చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ సారా అలీ ఖాన్. కేదార్ నాథ్ సినిమాతో కథానాయికగా పరిచయమై ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఏ వతన్ మేరే వతన్ '. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ ఆద్యంత ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో భుగర్భ రేడియో స్టేషన్ నడుపుతున్న స్వాతంత్ర సమరయోధురాలు 22 ఏళ్ల ఉషారాణి పాత్రను పోషించింది సారా. ఉషా రాణి జీవితంలోని కష్టాలు.. పోరాటల గురించిన సినిమా ఇది అని ముందు నుంచి చెప్పుకొచ్చారు మేకర్స్.

బ్రిటిన్ పాలనలో దేశవ్యాప్తంగా వార్తలను ప్రచారం చేసిన ధీర యువతి ఉషా రాణి నిజకథ. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తుండగా.. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. దేశభక్తి చిత్రంలో సారా నటించడం ఇదే మొదటిసారి. ఇందులో ఉషారాణి పాత్రలో అద్భుతమైన నటన కనబర్చింది సారా.

'మన చరిత్ర పుటల్లో వినిపించని ఓ హీరో స్వరాన్ని ప్రతిధ్వనించే ప్రయాణమిది'.. నేను నా దేశం కోసం ప్రాణం ఇస్తాను.. ఇది భారతదేశ స్వాతంత్ర్యం కోసం చేసే ఆఖరి యుద్ధం, ఈ రేడీయో దేశం గొంతుక అవుతుంది. మీరు ఇప్పుడు నన్ను చంపేయగలరు.. కానీ నేను జీవించి ఉన్నంత కాలం ఈ రేడియోను చావనినవ్వను అంటూ వచ్చిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

నిజమైన సంఘటన నుండి ప్రేరణ పొందిన ఏ వతన్ మేరే వతన్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ మూవీ మార్చిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో పాల్గొంది సారా. అలాగే ఈ బ్యూటీ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.

సరికొత్త దారిలో సైఫ్ కూతురు.. అద్భుత నటనతో కట్టిపడేస్తోన్న సారా అలీ ఖాన్..




