AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rozgar Mela: 71వేల మందికి ఉద్యోగ పత్రాలు.. ప్రధాని మోదీ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్స్ పంపిణీ..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. పీఎం రోజ్‌గార్ మేళాలో భాగంగా, ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ మరోసారి నియామక పత్రాలు అందజేశారు.

Rozgar Mela: 71వేల మందికి ఉద్యోగ పత్రాలు.. ప్రధాని మోదీ చేతుల మీదుగా  అపాయింట్‌మెంట్ లెటర్స్ పంపిణీ..
PM Narendra Modi
Sanjay Kasula
|

Updated on: May 16, 2023 | 11:33 AM

Share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. పీఎం రోజ్‌గార్ మేళాలో భాగంగా, ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ మరోసారి నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని పోస్టులకు ఎంపికైన 71 వేల మందికి మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని వర్చువల్‌ విధానంలో అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. అనంతరం ఎంపికైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. గతంలో కూడా ఇలాంటి రోజ్‌గార్ మేళాలో అపాయింట్‌మెంట్ లెటర్స్ జారీ చేసినట్లుగా గుర్తు చేశారు. నియామక పత్రాలను అందుకున్నవారిని అభినందించారు. గతంలో జాబ్ అప్లికేషన్ ఫాం కోసం పెద్ద క్యూ లైన్‌లో నిలబడాల్సి వచ్చేదని.. అంతేకాకుండా ఆ తీసుకున్న ఫాంను నింపి పోస్టు చేసేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని.. దానిపై అటెస్టేషన్ కోసం గెజిటెడ్ ఉద్యోగి కోసం తిరగాల్సి వచ్చేదని.. అన్ని కష్టాలు పడి చివరికి పోస్టు చేసినా అది చేరాల్సిన చోటికి చేరుతుందా అనేది పెద్ద ప్రశ్నగా ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని అన్నారు.

అభివృద్ది మార్గాల్లో భారత్ ప్రయాణిస్తోందనన్నారు. రహదారులను ఏర్పాటు చేయడంతో అన్ని దారులు దేశంలోని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కనెక్టివిటి పెరింగిందన్నారు.

దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రధాన మంత్రి రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి పెద్ద ఉద్యోగాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో కాలీగా ఉండే ఆఫీజుల్లో రిక్రూట్‌మెంట్‌ కంప్లీట్ చేసింది.

ఈ జాబితా ప్రకారం గ్రామీణ్ డాక్ సేవక్, పోస్టల్ ఇన్‌స్పెక్టర్, ట్రాక్ మెయింటేనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజనల్ ఆఫీసర్ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, తదితర పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో రిక్రూట్ అయిన వారికి నేడు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు.

లైవ్ వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం