PM Mitra Yojana: దేశంలో ఏడు టెక్స్‌టైల్ పార్కులు.. ఉపాధి కల్పనకు భారీ ప్రణాళిక.. ‘పీఎం మిత్రా’ పథకం లక్ష్యం ఇదే..

PM MITRA Yojna: కేంద్రంలోని మోదీ క్యాబినెట్ మరో కీలక పథకానికి ప్రణాళికలు రూపొందించి ఆమోదించింది. బుధవారం పీఎం మిత్ర (PM-MITRA) యోజన పథకానికి క్యాబినెట్

PM Mitra Yojana: దేశంలో ఏడు టెక్స్‌టైల్ పార్కులు.. ఉపాధి కల్పనకు భారీ ప్రణాళిక.. ‘పీఎం మిత్రా’ పథకం లక్ష్యం ఇదే..
Pm Mitra Yojna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 07, 2021 | 1:43 PM

PM MITRA Yojna: కేంద్రంలోని మోదీ క్యాబినెట్ మరో కీలక పథకానికి ప్రణాళికలు రూపొందించి ఆమోదించింది. బుధవారం పీఎం మిత్ర (PM-MITRA) యోజన పథకానికి క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ పథకం వస్త్ర రంగానికి సంబంధించినది. ప్రధాన మంత్రి మెగా టెక్స్‌టైల్ ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్, అపెరల్ స్కీమ్ (పీఎం మిత్ర) ద్వారా వస్త్ర రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఏడు కొత్త టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. వస్త్ర తయారీ రంగంలో మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు ఇది ప్రయోజనకరంగా మారనుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వస్త్ర శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

21 లక్షల ఉద్యోగాల కల్పన.. వచ్చే ఐదేళ్లలో ఈ పథకం కోసం 4,445 కోట్లు కేటాయించనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రధాని మోడీ భావితరాల కోసం 5 F విజన్‌తో ఈ పథకాన్ని రూపొందించినట్లు పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను దీనిలో ద్వారా కల్పించనున్నారు. ఈ పథకంతో.. టెక్స్‌టైల్ రంగంలో 21 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నారు. దాదాపు 7 లక్షల ప్రత్యక్షంగా.. 14 లక్షల పరోక్షంగా ఈ పథకం సాయంగా మారుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

పథకం ఇలా.. M-MITRA పథకాన్ని 2021 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించి రూపకల్పనలు చేశారు. మన దేశంలోని టెక్స్‌టైల్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దీనిని ఆమోదించారు. వస్త్రాల తయారీకి ఒకే చోట స్పిన్సింగ్, వీవింగ్, ప్రాసెసింగ్/డైయింగ్, ప్రింటింగ్ జరిగే విధంగా సమగ్ర వ్యవస్థను రూపొందించనున్నారు. దీనిద్వారా ఖర్చు సైతం తగ్గనుంది. ఒక్కొక్క పార్కు వల్ల ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీని ద్వారా ఉత్పత్తి, వ్యాపారం సులువుగా మారనుంది.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద.. వివిధ రాష్ట్రాలలో ఉన్న గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రదేశాలలో మిత్రా పార్కులను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం నిర్మించనుంది. అన్ని గ్రీన్ ఫీల్డ్ మిత్రా పార్కులను అభివృద్ధి చేయడానికి 500 కోట్లను అందించనున్నారు. బ్రౌన్ ఫీల్డ్ మిత్రా పార్కుల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించనున్నారు. తయారీ యూనిట్లకు పోటీ ప్రోత్సాహకాల కోసం అన్ని మిత్రా పార్కులకు 300 కోట్లను కేటాయించనున్నారు.

మిత్రా యోజన పథకం కింద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో పార్కులను అభివృద్ధి చేయనున్నారు. దీంతోపాటు వాహన రంగానికి కూడా చేయూతనిచ్చే విధంగా ప్రణాళికలు చేశారు. భారత కంపెనీలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలుగా ఎదగడానికి ఈ పథకం రూపొందించారు.

Also Read:

PM Narendra Modi: నరేంద్రుడి ప్రజా ప్రస్థానానికి 20 ఏళ్లు.. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు..

Sonu Sood: ఆపద్భాంధవుడు సోనూసూద్‌కు గుడి నిర్మాణం.. నిత్యపూజలు. ఎక్కడంటే..?