Sonu Sood: ఆపద్భాంధవుడు సోనూసూద్‌కు గుడి నిర్మాణం.. నిత్యపూజలు. ఎక్కడంటే..?
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి తన సొంత ఖర్చుతో రియల్ స్టార్ సోనుసూద్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు.
Sonu Sood: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి తన సొంత ఖర్చుతో రియల్ స్టార్ సోనుసూద్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. వెంకటేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సోనుసూద్ మీద ఉన్న ఎనలేని ప్రేమ.. అభిమానంతో విగ్రహ ఏర్పాటుకు పూనుకున్నాడు. విజయవాడ దగ్గరలో గల గొల్లపూడి లో విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ నుండి ఆటో లో విగ్రహాన్ని తన సొంత గ్రామానికి తీసుకువచ్చాడు. వెంకటేష్‌కు వచ్చిన ఆలోచనకి సంతోషించిన గ్రామస్తులందరూ అతనిని అభినందించారు.
కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలు చేయలేని చాలా మంచి పనులు సోనూసూద్ చేసి చూపించిన మంచి కార్యక్రమాలు నిరుపేదలకు సాయం అందించడంలో సోనూ చేసిన ఘనతను గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే వారికి తన సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి బస్సులో తరలించడం నిరుపేదలకు అండగా ఉండడం వంటి పలు కార్యక్రమాలు చేయడంలో సోనుసూద్ కు సాటి ఎవరు ఉండరని వెంకటేష్ చెబుతున్నారు.
కంటికి కనపడే దేవుడిగా భావించి సోనూసూద్ విగ్రహ ఏర్పాటుకు రూపకల్పనకు పూనుకున్నానని వెంకటేష్ చెప్పుకొచ్చాడు. సోనూసూద్ మనిషి రూపంలో వచ్చిన దేవుడిగా భావించి సోను సూద్ మీద ఉన్న ప్రేమ అభిమానాలతో తన ఊర్లో ఆ దేవుని విగ్రహం ఉండాలని ఏర్పాటు చేస్తున్నానని వెంకటేష్ పేర్కొన్నాడు. సోనుసూద్ విగ్రహం ఆవిష్కరణ కు తన దేవుడు అయిన సోనుసూద్ రావాలని ప్రయత్నిస్తానని కూడా వెంకటేష్ అంటున్నాడు. సోనూ విగ్రహానికి నిత్య పూజలు చేస్తానంటున్నాడు.