PM Narendra Modi: నరేంద్రుడి ప్రజా ప్రస్థానానికి 20 ఏళ్లు.. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు..
PM Narendra Modi completes 2 decades in public office: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజా సేవకు పున:రంకితమై నేటితో రెండు దశాబ్ధాలు పూర్తయింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి
PM Narendra Modi completes 2 decades in public office: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజా సేవకు పున:రంకితమై నేటితో రెండు దశాబ్ధాలు పూర్తయింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇరవై యేళ్లుగా నిరంతర ప్రజాసేవ చేస్తున్న వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి.. ప్రధానమంత్రిగా మోదీ 20 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు 20 రోజులపాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 7న భారతీయ జనతా పార్టీ తరుఫున భారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. నదులను శుభ్రపరచడం, వ్యాక్సినేషన్, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయాలు.. చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 2014వరకు కొనసాగారు. అనంతరం 2014 నుంచి రెండోసారి ప్రధానమంత్రిగా మోదీ సేవలందిస్తున్నారు. అయితే.. మోదీ సరిగ్గా 2001 అక్టోబర్ 7న ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకూ ఆయన నిరంతరం 20 ఏళ్లపాటు ప్రజా సేవలోనే ఉన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు బీజీపీ సన్నాహాలు చేసింది. సేవా ఔర్ సమర్పణ్ అభియాన్ పేరుతో బీజేపీ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు.. తమతమ నియోజకవర్గాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నరేంద్రమోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. ఆయన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సేవా దివస్‌గా వారంపాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. అయితే.. ఈ సారి 20 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ఎందుకంటే.. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి.. ప్రధానమంత్రిగా మోదీ 20 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పుర్తిచేసుకున్న సందర్భంగా 20 రోజులపాటు ఈ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేశారు.
Also Read: