Drugs Case: ఎన్ఐఏ చేతికి ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు.. విదేశీ మూలాలపై నజర్..

Mundra Port Drugs Case: గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో ఇటీవల వేలాది కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు నౌకల ద్వారా రూ.21వేల కోట్ల

Drugs Case: ఎన్ఐఏ చేతికి ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు.. విదేశీ మూలాలపై నజర్..
Drugs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 07, 2021 | 7:56 AM

Mundra Port Drugs Case: గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో ఇటీవల వేలాది కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు నౌకల ద్వారా రూ.21వేల కోట్ల విలువైన 3వేల కిలోల డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది. గుజరాత్‌లో పట్టుబడిన నార్కోటిక్స్‌ కేసు విచారణ ఎన్‌ఐఏకు బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే డీఆర్‌ఐ నుంచి ఎన్‌ఐఏ అధికారులు ఈ కేసును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. నార్కోటిక్స్‌ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తంకావడంతో కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతి, ఉగ్రవాద మూలాలపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది.

సెప్టెంబర్ 15న ముంద్రా నౌకాశ్రయంలో భారీగా హెరాయిన్‌‌ను పట్టుకున్నారు. అయితే దీని వెనుక తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ సూత్రధాధారిగా ఉన్నారు. అయితే.. అసలు సూత్రధారి మాత్రం ఢిల్లీ చెందిన వ్యక్తి అని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే.. ఆఫ్ఘన్ నుంచి ఇరాన్‌ మీదుగా.. విజయవాడ ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో ఈ మాదక ద్రవ్యాలు ముంద్రా పోర్టుకు వచ్చాయి. అయితే.. చీకటి వ్యాపార సంబంధాలపై అనుమానం రాకుండా ఇలా చేశారని నిఘా, దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్‌ తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించి, దాన్ని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని దర్యాప్తులో వెల్లడైంది.

Also Read:

Narendra Modi: నరేంద్రుడి ప్రజా ప్రస్థానానికి 20 ఏళ్లు.. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు..

Vizag Girl Death: వైజాగ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక కేసులో సంచలన విషయాలు