Vizag Girl Death: వైజాగ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక కేసులో సంచలన విషయాలు

వైజాగ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక(14) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక అపార్ట్‌మెంట్‌ నుంచి దూకి ఆత్మహత్యకు

Vizag Girl Death: వైజాగ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక కేసులో సంచలన విషయాలు
Girl

Visakhapatnam Girl Death case: వైజాగ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక(14) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక అపార్ట్‌మెంట్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తేల్చారు. బాలిక మృతికి కారణమైన కార్పెంటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లాలోని అగనంపూడి శనివాడలో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక డెత్‌ కేసులో దర్యాప్తు దాదాపు ముగిసింది. ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి.

బాలిక అనుమానాస్పద మృతి కేసులో 28 ఏళ్ల నరేష్‌ అనే కార్పెంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలికను ట్రాప్‌ చేసిన సదరు కార్పెంటర్ యువకుడు, పలుసార్లు శారీరకంగా కలిశాడని పోలీసులు గుర్తించారు. మంగళవారం కూడా బాలికను పేరెంట్స్‌కి తెలియకుండా రూమ్‌కి పిలిపించుకున్నాడని, అయితే బాలిక పేరెంట్స్‌ ఆమె కోసం వెతకడంతో అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ నుంచి నిందితుడు తాను ఉంటున్న 101 ఫ్లాట్‌కి పారిపోయాడని పోలీసులు తేల్చారు.

అయితే టెర్రస్‌పైనే ఉన్న బాలిక, తనను రక్షించాలని, పైకి రావాలని కార్పెంటర్ యువకుడ్ని కోరింది. అయితే నిందితుడు పైకి వెళ్లే లోపే టెర్రస్‌ పైనుంచి బాలిక కిందకి దూకేసిందని పోలీసులు తెలిపారు. పేరెంట్స్‌ చూస్తారనే భయంతో ఏం చేయాలో తెలియక పై నుంచి కిందకి దూకేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఐదో ఫ్లోర్‌ నుంచి దూకడంతో కుడికాలు విరిగిపోయింది. నరాలు కూడా చిట్లిపోవడంతో బాలిక మరణించిందని పోలీసులు తెలిపారు.

అంతేకాదు, నిందితుడు కార్పెంటర్ నరేష్‌ గురించి సంచలన విషయాలు బయట పెట్టారు పోలీసులు. బాలికకు పోర్న్‌ వీడియోలు చూపించి ప్రేరేపించేవాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Read also: Modi Cabinet: దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు.. రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్. కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu