PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌ కింద డబ్బులు జమ.. ఎప్పటి నుంచి అంటే..!

PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ప్రభుత్వ ప్రజాదరణ పొందిన పథకాల్లో ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వం..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌ కింద డబ్బులు జమ.. ఎప్పటి నుంచి అంటే..!
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: May 12, 2021 | 6:19 AM

PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ప్రభుత్వ ప్రజాదరణ పొందిన పథకాల్లో ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏటా రూ .6 వేలు అందిస్తుంది. ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాకు పంపుతారు. ప్రతి నాలుగు నెలలకోసారి ఈ రూ.2వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది.

అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద మోదీ సర్కార్ రైతులకు అందిస్తున్న డబ్బులను 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. అయితే రైతులకు పీఎం కిసాన్ రూ.2 వేల డబ్బులు అందనున్నాయి. మోదీ సర్కార్ ఇప్పటికే ఈ డబ్బులును రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఇంకా రైతుల డబ్బులు అందలేదు. ఏప్రిల్‌ నెలలో రావాల్సిన డబ్బులు ఇంకా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. అయితే మే 14 నుంచి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. మోదీ ప్రభుత్వం ఇప్పటికే 7వ విడత డబ్బులను రైతులకు ఖాతాల్లో వేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు రైతులకు రావాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతులకు రూ.6వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రూ.6వేలు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే రైతులు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులు వచ్చాయా? లేదా చెక్‌ చేసుకోవచ్చు.

అయితే పీఎం కిసాన్ సమ్మన్ నిధి కింద మొదటి విడత రూ. 2వేలు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడవ విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది రైతులు ఈ డబ్బులను అందుకున్నారు. అయితే కొంతమంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఈసారి కేంద్రం ఈ స్కీం నిబంధనలలో అనేక మార్పులు చేసింది.

వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చేసుకోవాలంటే..

1. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmksan.gov.in/ ను సందర్శించాలి. 2. ఆ తర్వాత మీక ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి. 3. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

ఇవీ కూడా చదవండి:

Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!

ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!