Snowfall: పాల సముద్రాన్ని తలపిస్తోన్న హిమాలయ పర్వత శ్రేణి.. మనసును దోచేస్తున్న ప్రకృతి అందాలు
పాల సముద్రాన్ని తలపిస్తోంది హిమాలయ పర్వత శ్రేణి. మంచు వర్షంతో కొంత అందాలను సంతరించుకున్నాయి. మంచుతో శ్వేత వర్ణంలో మెరిసిపోతూ పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి. ఐతే హిమాలయ పర్వత శ్రేణులు శీతాకాలంలో కొత్త అందాలను సంతరించుకున్నాయి. అక్కడి ప్రకృతి అందాలను మరింత పెంచేసింది హిమపాతం. మంచుతో శ్వేతవర్ణంలో మెరిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్ మంచు ఖండాన్ని తలపిస్తోంది. మంచు వర్షం కురుస్తుండటంతో ఎటు చూసినా దట్టమైన మంచు పేరుకుపోయింది. అక్కడి మంచు అందాలు పర్యాటకుల మనసును దోచేస్తున్నాయి.
ఇక చార్‌ధామ్‌లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం మంచు వర్షంలో తడిసి ముద్దయ్యింది. బద్రినాథ్ క్షేత్రంతో పాటు, ఆలయ పరిసరాల్లో విపరీతంగా మంచు కురిస్తోంది. పాల నురగల్లాంటి మంచు అందాలు పరవశింపజేస్తున్నాయి. కొండ ప్రాంతమంతా భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. రోడ్లపై 2 నుంచి 3 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఎటుచూసినా మంచు కనువిందు చేస్తోంది. చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటినీ కప్పేసింది మంచు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది.
ఐతే స్నో ఫాల్‌తో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుగున్నారు. చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. మంచుతో వాహన రాకపోకలకు అంతరాయం కులుగుతోంది. దీంతో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. మంచు చరియలు విరిగిపడే ప్రమాదముందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Also Read: Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా
ఈ ఫోటోలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో వైఫ్ కూడా.. గుర్తుపట్టారా..?