Air India: కీలక మలుపు తీసుకున్న మూత్ర విసర్జన కేసు.. నిందితుడికి బెయిల్ మంజూరు..

ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరైంది. పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది...

Air India: కీలక మలుపు తీసుకున్న మూత్ర విసర్జన కేసు.. నిందితుడికి బెయిల్ మంజూరు..
Shankar Mishra
Follow us

|

Updated on: Jan 31, 2023 | 9:01 PM

ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరైంది. పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో.. మద్యం తాగిన మత్తులో ఉన్న శంకర్ మిశ్రా తన పక్కన కూర్చున్న ఓ వృద్ద మహిళపై మూత్ర విసర్జన చేశాడు. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆమె.. ఘటనపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు శంకర్ మిశ్రాను అరెస్టు చేశారు. అనంతరం పటియాలా హౌజ్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే.. తాను ఏమీ చేయలేదని కావాలనే దురద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని శంకర్ మిశ్రా ఆరోపించారు. ఈ ఘటనతో అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువు తీశారని వాదిస్తూ ఢిల్లీ పోలీసులు నిందితుడికి బెయిల్‭ను వ్యతిరేకించారు.

విమాన కెప్టెన్లను, క్యాబిన్‌ సిబ్బందిని, ఇతర ప్రయాణికులను నిందితుడు గుర్తించాల్సి ఉందని, మూడు రోజుల తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. దీనికి స్పందించిన కోర్టు.. ప్రజల నుంచి ఒత్తిడి ఉందని, ఇలా కోరుకోవడం మంచిది కాదని సూచించింది. చట్టప్రకారం నడుచుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో పోలీసుల అభ్యర్థనను మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ అనామిక తిరస్కరించారు. నిందితుడిని 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసు విషయంలో ఎయిర్ ఇండియా సకాలంలో చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీసీఏ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో డీజీసీఏ ఎయిర్ ఇండియాను ప్రశ్నించారు. తాజాగా పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యంకు రూ.30లక్షల జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.