ముంబై.. పాక్ స్పై నెట్ వర్క్ రాకెట్ కి చెక్..

జమ్మూ కాశ్మీర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ అతి పెద్ద పాక్ స్పై నెట్ వర్క్ రాకెట్ ని ఛేదించారు. లడఖ్ లోని భారత రక్షణ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఈ నెట్ వర్క్ ముంబైలో  అక్రమంగా వాయిస్ ఓవర్...

ముంబై.. పాక్ స్పై నెట్ వర్క్ రాకెట్ కి చెక్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 4:49 PM

జమ్మూ కాశ్మీర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ అతి పెద్ద పాక్ స్పై నెట్ వర్క్ రాకెట్ ని ఛేదించారు. లడఖ్ లోని భారత రక్షణ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఈ నెట్ వర్క్ ముంబైలో  అక్రమంగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ని వినియోగించుకుంటున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంకా  ఇలాంటి ఇతర ఎక్స్ఛేంజీలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో, ఈ ముఠాకి ఇంకా ఎవరెవరితో ప్రమేయం ఉందో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. స్పాట్ నుంచి పోలీసులు మూడు సిమ్ బాక్సులను, స్టాండ్ బై గా ఉన్న మరో సిమ్ బాక్సును, 191 సిమ్ కార్డులను, లాఫ్ టాప్ మోడెమ్ ని, యాంటెన్నాలు, బ్యాటరీలు, కనెక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెట్ వర్కులపై వాయిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్.. వాయిస్ తో బాటు మల్టీ మీడియా కంటెంట్ గా కూడా  పని చేస్తుంది. లడక్ ప్రాంతానికి సంబంధించిన మొత్తం సమాచారం, సంబంధిత నెంబర్లను కనుగొనేందుకు ఈ ఎక్స్ఛేంజి ద్వారా ఈ స్పై నెట్ వర్కును పాకిస్థాన్ వినియోగించుకుంటున్నట్టు భావిస్తున్నారు. కాలర్లు కావాలనే తప్పుడు ఐడెంటిటీని ఉపయోగిస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ యవ్వారంలో  పాక్ ఐఎస్ఐ ప్రమేయం కూడా ఉన్నట్టు సమాచారం,. ఈ నెల 28 న ఛేదించిన పోలీస్ రైడ్ లో చైనీస్ సిమ్ బాక్సులను కూడా ఈ నెట్ వర్క్ వాడినట్టు తెలిసింది. ఈ బాక్సులు డైనమిక్ ఐఎంఈ సిస్టం ను కూడా వినియోగించుకుంటున్నాయట. ట్రాక్  (ట్రేస్)చేయలేని ఈ సిస్టం ని ట్రాయ్…. చట్టవిరుధ్ధమని ప్రకటించింది. దీనివల్ల ట్రాయ్ కి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.

ఇప్పటికే లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా, భారత దళాల మధ్య ఘర్షణ పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో…ఈ  పాక్ స్పై నెట్ వర్క్ రాకెట్ వ్యవహారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనా, పాక్ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం గమనార్హం. పాకిస్తాన్ ముంబైనే ఎంచుకోవడానికి ఈ నగరం భారత వాణిజ్య రాజధాని కూడా కారణమని భావిస్తున్నారు.