మహా పోలీసులను వణికిస్తోన్న కరోనా.. తాజాగా మరో 114
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే లక్షా డెబ్బై వేల మందికి పైగా సోకింది. వీరిలో డెబ్బై వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకోగా.. మరో నాలుగు వేల తొమ్మిది వందల మంది మరణించారు. ఇక మరో తొంబై వేల మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. అయితే సామాన్య ప్రజలతో పాటుగా.. అక్కడి పోలీసులను కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. […]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే లక్షా డెబ్బై వేల మందికి పైగా సోకింది. వీరిలో డెబ్బై వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకోగా.. మరో నాలుగు వేల తొమ్మిది వందల మంది మరణించారు. ఇక మరో తొంబై వేల మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. అయితే సామాన్య ప్రజలతో పాటుగా.. అక్కడి పోలీసులను కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. శనివారం నాడు తాజాగా మరో 114 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు.. ఓ పోలీస్ అధికారి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బారినపడ్డ పోలీస్ సిబ్బంది సంఖ్య 2,325కి చేరింది. ఇక మరణించిన వారి సంఖ్య 26కు చేరింది.



