పాక్ మరోసారి కవ్వింపు చర్యలు.. నౌగాం సెక్టార్ మీదుగా కాల్పులు..
పాకిస్థాన్ మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు కరోనాతో యావత్ ప్రపంచం యుద్ధం చేస్తుంటే.. పాక్ మాత్రం నిత్యం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.
పాకిస్థాన్ మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు కరోనాతో యావత్ ప్రపంచం యుద్ధం చేస్తుంటే.. పాక్ మాత్రం నిత్యం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు పాక్ సైన్యం పరోక్షంగా సహాయం చేస్తోంది. భారత సైనిక శిబిరాలను, సరిహద్దులోని గ్రామాలను టార్గెట్ చేస్తూ.. దాడులకు దిగుతోంది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం.. పాక్ కాల్పులకు ధీటుగా ఎదురు సమాదానం ఇస్తోంది. తాజాగా బుధవారం నాడు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. నౌగాం సెక్టార్ వద్ద కాల్పులకు దిగారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. గత మూడు నెలలుగా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు దిగుతోంది.