భారత్‌-చైనాల మధ్య ఘర్షణ.. త్రివిధ దళాలు అప్రమత్తం..

భారత్‌-చైనాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం రాత్రి ఇరు దేశాలకు చెందిన జవాన్ల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే.

భారత్‌-చైనాల మధ్య ఘర్షణ.. త్రివిధ దళాలు అప్రమత్తం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 17, 2020 | 4:46 PM

భారత్‌-చైనాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం రాత్రి ఇరు దేశాలకు చెందిన జవాన్ల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. మరోవైపు చైనాకు చెందిన 43 మంది సైనికులు కూడా మరణించారు. ఈ క్రమంలో లడాక్‌లోని గాల్వన్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈక్రమంలో భారత త్రివిధ దళాలు అలర్ట్‌ అయ్యాయి. షిప్స్‌, ఫైటర్‌ జెట్స్‌లన్నీ ముందుకు కదుదలుతున్నాయి. ఇక శత్రువులు రెచ్చిపోతే చూస్తూ ఊరుకునేది లేదని.. ఎల్‌ఏసీ వద్ద రూల్స్ కూడా మార్చామని అధికారులు తెలిపారు. ఇకపై శత్రువులు రెచ్చిపోతుంటే.. అధికారుల అనుమతి కోసం నిరీక్షించాల్సిన పనిలేదని.. శత్రవులను ఎదుర్కోవడానికి మీరు చేయాల్సిన ప్రయత్నం చేయాలని అధికారులు సైన్యానికి కమాండర్లు సూచించారు.

మరోవైపు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించారు. దీనికి అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాన్ని పంపారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.