AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Story లడఖ్.. గాల్వన్ వ్యాలీలో ఆ రోజు ఏం జరిగింది?

లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో భారత, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా దళాల్లో 45 మంది గాయపడడమో, మరణించడమో జరిగిందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. సుమారు అయిదు దశాబ్దాల అనంతరం ఇండో-చైనా దళాల ..

Big Story లడఖ్.. గాల్వన్  వ్యాలీలో ఆ రోజు ఏం జరిగింది?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 17, 2020 | 5:33 PM

Share

లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో భారత, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా దళాల్లో 45 మంది గాయపడడమో, మరణించడమో జరిగిందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. సుమారు అయిదు దశాబ్దాల అనంతరం ఇండో-చైనా దళాల  మధ్య జరిగిన అతి పెద్ద ఘర్షణ ఇది.. 1967 లో నాథూ లా వద్ద కూడా ఇదే విధమైన ఘర్షణలు జరిగాయి. నాటి ఆ ఘటనలో 80 మంది భారత సైనికులు, సుమారు 300 మంది చైనా సైనికులు మృతి చెందారు. కాగా కోవిడ్-19 మీద పోరుపై ప్రభుత్వం దృష్టి సారించిన ఈ సమయంలో చైనా ఈ కవ్వింపు చర్యలకు దిగడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ నెల 6 న లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో ఉభయ దేశాల దళాల మధ్య చర్చలు జరిగాయి. లడఖ్ తూర్పు ప్రాంతంలో నెలరోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను సడలించడానికి ఆ చర్చలు జరిగాయి. అప్పటికి పరిస్థితి సద్దు మణిగినట్టు కనిపించినా.. ఈ నెల రెండో వారంలో చైనా దళాలు తిరిగి వఛ్చి భారత భూభాగాల ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేశాయి. దీంతో వాటిని మన సైన్యం నాశనం చేసింది. ఆ సందర్భంలో రెండు దేశాల సైనికులు తలపడగా పలువురు గాయపడ్డారు. ఈ నెల 14 న చైనా సోల్జర్స్ పెద్ద సంఖ్యలో తిరిగి వఛ్చి భారత సైనికులపై రాళ్లు రువ్వారు. ఈ నెల 15 వ తేదీ సాయంత్రంఇదే వ్యాలీలో గాల్వన్ నది వద్ద మెల్లగా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఆ ఘర్షణల్లో అనేకమంది భారత సైనికులను చైనా దళాలు నదిలోకి తోసివేశాయి. చైనా సైనికులు వెనక్కి మళ్ళక పోవడంతో కల్నల్ సంతోష్ ఆధ్వర్యాన నిరాయుధులైన ఓ సైనిక బృందం చైనీయులతో చర్చలకు సిధ్ధపడింది. కానీ ఈ చర్చలను నిరాకరించిన చైనా వారు పెద్ద పెద్ద బండరాళ్లు, ఇనుప తీగలు చుట్టిన రాడ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఎవరూ కాల్పులకు దిగకపోయినప్పటికీ ఈ ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు. సంతోష్ సహా గాయపడిన వారిని తీసుకుని భారత సైనికులు వెనక్కి తమ క్యాంపు వద్దకు తీసుకువచ్చాయి.

అనంతరం ఓ మేజర్ నేతృత్వాన మరికొందరు సైనికులు అదే స్పాట్ కి చేరుకొని చైనా సైనికులపై విరుచుకపడ్డారు. ఈ ఘర్షణల్లో సుమారు 56 మంది డ్రాగన్ కంట్రీ సైనికులు గాయపడ్డారు. ఈ సందర్భంలో  మళ్ళీ అనేకమంది భారత సైనికులను ఓ కొండపై నుంచి  చైనావారు  గాల్వన్ నదిలోకి నెట్టివేశారు. ఈ ఘర్షణలు సుమారు మూడు గంటలపాటు కొనసాగాయి.