రాజధానిలో కరోనా విజృంభణ: ఆప్ ఎమ్మెల్యే ఆతిషీ, అక్షయ్‌కు పాజిటివ్
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ నిబంధనలను ఢిల్లీ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆప్ ఎమ్మెల్యేలు...
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ నిబంధనలను ఢిల్లీ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆప్ ఎమ్మెల్యే ఆతిషీ, పార్టీ ప్రతినిధి అక్షయ్ మరాఠేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆప్ ఎమ్మెల్యే ఆతిషీకి కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. ఆతిషితో పాటు, పార్టీ ప్రతినిధి అక్షయ్ మరాఠేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బుధవారంనాడు వైద్య పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం వీరి ఇద్దరూ కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించేపనిలో పడ్డారు అధికారులు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆతిషీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, ఆమె త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యవంతురాలిగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నానంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే, ఇంతకు ముందు విశేష్ రవి, రాజ్‌కుమార్ ఆనంద్ అనే ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది.