ఏపీలో ప్రారంభమైన అంతర్‌ రాష్ట్ర సర్వీసులు

సుదీర్ఘ విరామం తర్వాత ఏపీఎస్ఆర్‌టీసీ అంతర్‌ రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించింది. తొలి దశలో చిత్తూరు రీజియన్ పరిధిలో 30సర్వీసులను తగిన జాగ్రత్తలను తీసుకొని నడుపుతోంది.

ఏపీలో ప్రారంభమైన అంతర్‌ రాష్ట్ర సర్వీసులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 17, 2020 | 4:36 PM

సుదీర్ఘ విరామం తర్వాత ఏపీఎస్ఆర్‌టీసీ అంతర్‌ రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించింది. తొలి దశలో చిత్తూరు రీజియన్ పరిధిలో 30సర్వీసులను తగిన జాగ్రత్తలను తీసుకొని నడుపుతోంది. ఈనెల 15నుంచే ఓపీఆర్‌ఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించిన ఆర్టీసీ…కొన్ని జిల్లాల నుంచి కర్నాటకు బస్సు సర్వీసులను నడుపుతోంది. ప్రతి ప్రయాణికుడి వ్యక్తిగత వివరాలతో పాటు రాకపోకల వివరాలు సేకరిస్తోంది. ఏపీ, కర్నాటక సరిహద్దుల్లో తనిఖీలకు ప్రయాణికులు సహాకరించాలని కండీషన్‌ పెట్టింది. అంతర్‌ రాష్ట్ర ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్‌ తప్పని సరి చేసింది ఆర్టీసీ.