AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మొబైల్ యాప్స్ ను వాడకుండా చూడండి.. కేంద్రానికి ఇంటెలిజెన్స్ సూచనలు..

భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. భారతసైన్యంపై చైనా దాడిచేయడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి

ఆ మొబైల్ యాప్స్ ను వాడకుండా చూడండి.. కేంద్రానికి ఇంటెలిజెన్స్ సూచనలు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 17, 2020 | 4:12 PM

Share

భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. భారతసైన్యంపై చైనా దాడిచేయడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం కీలక సూచనలు చేశారు. చైనాతో లింక్ ఉన్న 52 మోబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేయాలని లేదా.. వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని సూచనలు చేశారు. ఈ జాబితాలో జూమ్ యాప్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్‌ఇట్, క్లీన్ మాస్టర్‌తో పాటు మరో 52 అప్లికేషన్లను ఇంటెలిజెన్స్ అధికారులు తమ జాబితాలో పేర్కొన్నారు.

కాగా.. ఇంటెలిజెన్స్ అధికారులు సూచించిన వీటికి.. జాతీయ భద్రతా కౌన్సిల్ కూడా మద్దతు పలికిందని, ఇవి భారత దేశ భద్రతకు అత్యంత ప్రమాదకారులని సంబంధిత అధికారులు ధ్రువీకరించుకున్నారని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సిఫార్సులపై కేంద్రం చాలా లోతుగా చర్చలు జరుపుతోందని, ప్రతి మొబైల్ యాప్‌తో వచ్చే ప్రమాదాన్ని ఒక్కొక్కటిగా అధికారులు పరిశీలిస్తూనే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. జూమ్ యాప్ ఏమాత్రం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లోనే స్పష్టం చేసిన విషయం విదితమే.

Follow Us
ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం!
ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం!
కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు!
కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు!
మాతృత్వపు అనుభూతి అద్భుతం..నెటిజన్లతో ముచ్చటించిన సమంత!
మాతృత్వపు అనుభూతి అద్భుతం..నెటిజన్లతో ముచ్చటించిన సమంత!
జీతం పెరిగినా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగటం లేదా..?
జీతం పెరిగినా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగటం లేదా..?
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..