స్మగ్లింగ్‌ కేసు ఛేదించిన.. 8 మంది డీఆర్‌ఐ అధికారుల హోం క్వారంటైన్‌!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది.

స్మగ్లింగ్‌ కేసు ఛేదించిన.. 8 మంది డీఆర్‌ఐ అధికారుల హోం క్వారంటైన్‌!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 17, 2020 | 4:47 PM

Home quarantine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. తెలంగాణాలో ఇప్పటివరకు మొత్తం 5,406 కేసులు నమోదు కాగా.. 191 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రం 3,027 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2,188 ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 261 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఈ నేపథ్యంలో.. సిగరెట్‌ స్మగ్లింగ్‌ కేసును ఛేదించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులకు కరోనా భయం పట్టుకుంది. వారు పట్టుకున్న ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ తేలడంతో ఎనిమిది మంది అధికారులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నెల 12న దుబాయ్‌ నుంచి రూ. 12 కోట్ల విలువైన సిగరెట్లను జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌కు అక్రమంగా దిగుమతి చేస్తున్న చెంబూరుకు చెందిన ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. అయితే, అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో డిప్యూటీ డెరెక్టర్‌ ఆఫ్‌ డీఆర్‌ఐతో సహా ఎనిమిది మంది హోంక్వారైట్‌న్‌లోకి వెళ్లారు. వారందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ డీఆర్‌ఐ (ముంబై జోనల్‌) రాజేశ్‌పాండే వెల్లడించారు.