Jammu Kashmir: పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం.. దురదృష్టకరమన్న మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

దాయాది దేశం పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలను తమ గగతలం నుంచి వెళ్లేందుకు అనుమతించబోమని ప్రకటించింది.

Jammu Kashmir: పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం.. దురదృష్టకరమన్న మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
Pakistan PM Imran Khan
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 03, 2021 | 2:43 PM

జమ్ముకశ్మీర్ ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తూ దాయాది దేశం పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలు తమ దేశ గగతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించబోమని ప్రకటించింది. ఎలాంటి స్పష్టమైన కారణాలు చెప్పకుండానే పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ నిర్ణయంతో జమ్ముకశ్మీర్ నుంచి షార్జాకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోనున్నారు. తమ ప్రయాణానికి వారు ఎక్కువ సమయం వెచ్చించడంతో పాటు అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిలో పడుతాయని ఆశిస్తున్న వారు.. పాక్ తాజా నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

పాకిస్థాన్ నిర్ణయం దురదృష్టకరమని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. 2009-2010లో శ్రీనగర్ నుంచి దుబాయ్ వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల విషయంలోనూ పాక్ ఇలాంటి నిర్ణయమే తీసుకుందని గుర్తు చేశారు. గో ఫస్ట్ ఎయిర్‌వేస్ విమానం పాకిస్థాన్ గగనతలంపై వెళ్లేందుకు ఆ దేశం అనుమతిస్తుందని భావించినట్లు చెప్పారు.

కాగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంనాడు ప్రత్యేక వీవీఐపీ విమానంలో ఇటలీకి వెళ్లేందుకు పాక్ గగనతలాన్ని వాడుకున్నారు. అలాగే పాక్ అనుమతితో వెనక్కి తిరిగొచ్చేందుకు కూడా పాక్ గగనతలంను వాడుకున్నారు. మోడీ విమానం పాక్ గగనతలంపై వెళ్లేందుకు అనుమతివ్వాలని భారత పౌరవిమానయాన శాఖ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరగా.. ఆ మేరకు పాక్ దీనికి అనుమతి ఇచ్చింది.

Also Read..

Diwali 2021: రేపు తెలంగాణాలో వాక్సిన్‌కు హాలిడే.. దీపాలు వెలిగిస్తున్న సమయంలో శానిటైజర్స్ ఉపయోగించవద్దని వినతి

PM Modi: అజాగ్రత్త వద్దు.. మరో సంక్షోభం రావొచ్చు.. వ్యాక్సినేషన్​ స్పీడ్ పెంచండి..