PM Modi: అజాగ్రత్త వద్దు.. మరో సంక్షోభం రావొచ్చు.. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచండి..
COVID-19 vaccination review meet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న వైద్య సిబ్బందిని ప్రధాని అభినందించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న వైద్య సిబ్బందిని ప్రధాని అభినందించారు. వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారుల కృషి వల్లే వ్యాక్సినేషన్ లో దేశం ఈ స్థాయిలో పురోగతి సాధించిందని మోడీ చెప్పారు. జిల్లా అధికారుల నుంచి.. ఆశావర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ టీకా పంపిణీ కోసం కష్టపడ్డారన్నారు. మైళ్ల దూరం నడిచారు, మారుమూల ప్రాంతాలకు వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వాక్సిన్ను విస్మరించినట్లయితే, కొత్త సంక్షోభం ఏర్పడవచ్చని అన్నారు.
రండి.” 100 ఏళ్లలో ఈ అతిపెద్ద మహమ్మారి సమయంలో దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందని ఆయన అన్నారు. “కరోనాపై దేశం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ప్రాంతాల్లో టీకాను పెంచడానికి మీరు కూడా వినూత్న పద్ధతులపై కృషి చేయాలి” అని 40 జిల్లాలకు పైగా జిల్లా మేజిస్ట్రేట్‌లతో ఆయన అన్నారు. ప్రధానంగా జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయలోని చాలా జిల్లాలు వ్యాక్సినేషన్లో వెనకపడ్డాయి. భారతదేశంలోని అర్హతగల జనాభాలో 78 శాతం మందికి పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క మొదటి డోస్ ఇచ్చారు. అయితే దాదాపు 38 శాతం మంది మాత్రమే రెండు డోసులు వేసుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల వరకు గత 24 గంటల్లో 41,16,230 వ్యాక్సిన్ డోస్‌లు వేసినట్లు నివేదకి పేర్కొంది. భారతదేశంలో ఇప్పటి వరకు 107.29 కోట్ల టీకా డోసులు దాటింది. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
“వ్యాధులను, శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చివరి వరకు మనం పోరాడాలి. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఇది(కొవిడ్19) వందేళ్లలో అతిపెద్ద మహమ్మారి. దీని వల్ల దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనాపై పోరాడేందుకు కొత్త పరిష్కారాలు కనుక్కోవడం చాలా గొప్ప విషయం. మీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కవరేజీ పెంచేందుకు మీరు కూడా వినూత్న పద్ధతులను పాటించాలి.” అని మోడీ అన్నారు.
తాజాగా దేశంలో 10,68,514 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మందురోజు కంటే కేసులు 14 శాతం మేర కేసులు పెరిగాయి. నిన్న 311 మంది మరణించారు. ఒక్క కేరళలో 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరగా.. 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 14,159 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.37 కోట్లకు చేరువయ్యాయి. ప్రస్తుతం 1,51,209 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసులు 252 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. ఆ రేటు 0.44 శాతం తగ్గగా.. రికవరీ రేటు 98.22 శాతానికి పెరిగింది.
Read Also.. Viral Video: డ్రమ్స్ వాయించిన ప్రధాని మంత్రి మోడీ.. వైరల్‌గా మారిన వీడియో..