AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhilesh Yadav: పాక్ ఐఎస్ఐ నుంచి అఖిలేష్ యాదవ్‌కు ఆర్థిక సాయం.. యూపీ మంత్రి సంచలన ఆరోపణలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ శ్వరూప్ శుక్లా సంచలన ఆరోపణలు చేశారు.

Akhilesh Yadav: పాక్ ఐఎస్ఐ నుంచి అఖిలేష్ యాదవ్‌కు ఆర్థిక సాయం.. యూపీ మంత్రి సంచలన ఆరోపణలు
Akhilesh Yadav
Janardhan Veluru
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:24 PM

Share

Akhilesh Yadav: యూపీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ శ్వరూప్ శుక్లా సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ నుంచి అఖిలేష్ యాదవ్‌కు ఆర్థిక సాయం అందుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముస్లీంల ఓట్ల కోసం అఖిలేష్ యాదవ్ తన మతాన్ని మార్చుకున్నా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇస్లామిక్ ప్రపంచానికి యోగి ఆదిత్యనాథ్ ముప్పుగా పరిణమించారని.. అందుకే అఖిలేష్ యాదవ్‌కు వారి నుంచి పూర్తి మద్ధతు లభిస్తోందని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్‌ను ఓడించేందుకు ఐఎస్ఐ నుంచి అఖిలేష్ యాదవ్‌కు సలహాలు సూచనలు అందుతున్నట్లు పేర్కొన్నారు. పాక్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నాపై ఆదివారంనాడు అఖిలేష్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించిన నేపథ్యంలో మంత్రి శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు.

ముస్లీంల మెప్పు కోసం అఖిలేష్ యాదవ్ నమాజ్ చేశారు..ఉపవాస దీక్షలు చేశారు.. అవసరమైతే ముస్లీం మతాన్ని స్వీకరించేందుకు కూడా ఆయన వెనుకాడరంటూ మంత్రి శుక్లా ఆరోపించారు. ఐఎస్ఐ సూచనల మేరకే అఖిలేష్ యాదవ్ జిన్నాను మెచ్చుకుంటున్నారని అన్నారు. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చడం గర్హనీయమన్నారు. పాకిస్థాన్, తాలిబన్ల చెవులకు ఇంపుగా ఉండే మాటలు అఖిలేష్ మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

Also Read..

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..