Padma Shri 2023: పాములు పట్టేవారికి పద్మశ్రీ.. భారత్ టు అమెరికా ఎక్కడైనా సరే వీరు బరిలోకి దిగితే పాములకు హడలే..
పాము పట్టడంలో నిష్ణాతులైన గోపాల్, సదయ్యన్‌లకు ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. అయితే నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, పాములను పట్టుకోవడానికి ప్రజలకు శిక్షణ ఇస్తున్నారు. స్నేహితులిద్దరూ తమ పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన పాములను పట్టుకోవడానికి పురాతన టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నారు.

పాములు పట్టేవారిని పద్మశ్రీ వరించింది. అవును.. భారత్‌నుంచి అమెరికా వరకూ ఎంతటి విషపూరితమైన పాములైనా వీరు బరిలోకి దిగతే తోక ముడవాల్సిందే. పాములు పట్టడంలో వీరికి వీరే సాటి. తమిళనాడు చెంగల్వపట్టు జిల్లా సెందురి గ్రామానికి చెందిన వెనుకబడిన వర్గానికి చెందిన వడివేల్ గోపాల్, మాసి సడయన్ 2023 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డకు ఎంపికయ్యారు. పాములు పట్టడమే వృత్తిగా జీవించే వారికి ఇంత అత్యున్నత పురస్కారం దక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వంశపారంపర్యంగా వస్తున్న ఈ విద్యతో ఈ ఇద్దరూ ఒక్క ఇండియాలోనే కాదు అగ్రరాజ్యం అమెరికా వరకూ తమ సేవలను అందించారు. అలాంటి వీరిని పద్మశ్రీ దక్కడం అత్యంత అభినందనీయం.
పాము పట్టడంలో నిష్ణాతులైన గోపాల్, సదయ్యన్‌లకు ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. అయితే నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, పాములను పట్టుకోవడానికి ప్రజలకు శిక్షణ ఇస్తున్నారు. స్నేహితులిద్దరూ తమ పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన పాములను పట్టుకోవడానికి పురాతన టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నారు. దీంతో వడివేల్, సడయన్ అంతర్జాతీయ స్థాయిలో పాములు పట్టే శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు.
రెండేళ్ల క్రితం అమెరికాలోని ఫ్లోరిడాలో కొండచిలువలను పట్టుకునేందుకు పైథాన్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 800 మందికి పైగా పాములు పట్టేవారు పాల్గొన్నారు. ఈ పైథాన్ ఛాలెంజ్‌లో గోపాల్, సదయ్య బృందం కూడా పాల్గొన్నారు. ఇద్దరూ ఫ్లోరిడాలో అంతరించిపోతున్న అనేక బర్మీస్ కొండచిలువలను పట్టుకున్నారు. ఈ ఛాలెంజ్‌లో భారత జట్టు అత్యధిక కొండచిలువలను పట్టుకున్నట్లు సమాచారం. అమెరికా ఫ్లోరిడాలోని కొండ చిలువలను పట్టే ప్రముఖ నిపుణుడు రోమ్లస్ విక్టోరికర్ బృందంలో ఈ ఇద్దరు సభ్యులుగా ఉన్నారు.




ఫ్లోరిడాలో 10 రోజుల్లో 14 ప్రమాదకరమైన కొండచిలువలను గోపాల్, మాసి సదయన్ పట్టుకున్నారు. ఫ్లోరిడా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అధికారులు వీరి కళకు ముగ్ధులయ్యారు. పాములను ఎలా పట్టుకోవాలో నేర్పడానికి వీరిని నియమించారు. అనంతరం థాయ్‌లాండ్, ఇతర దేశాల నుండి పాములను పట్టుకోవడానికి ఇద్దరికి పిలుపు అందుకున్నారు. ఈ జంట అనేక దేశాలకు వెళ్లి పాములు పట్టడంలో అక్కడ యువకులకు శిక్షణ ఇస్తున్నారు.
కాగా తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై వడివేల్ గోపాల్ స్పందిస్తూ.. ఈ ఘనత అందుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. అమెరికా, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలలో తాము పాములు పట్టామని, అధిక విషం కలిగిన పాములు ఎన్ని పట్టామో తనకే తెలియదని పేర్కొన్నారు. ఇక మాసి సడయన్ అయితే.. పద్మశ్రీ రావడం గొప్ప ఘతన అని ఈ ఆనందానికి మాటలు లేవని వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..