Pakisthan: త్వరలో పాక్ నాలుగు ముక్కలవుతుంది.. భారత్‌లో కలుస్తామని ప్రజలు డిమాండ్ చేస్తారంటూ బాబా రామ్ దేవ్ జోస్యం ..

భారతదేశంతో సాంస్కృతిక సారూప్యతలను కలిగి ఉన్నందున బలూచిస్తాన్ స్వయంగా భారతదేశంలో విలీనం కావాలని కోరుకుంటుందని చెప్పారు. అంతేకాదు అతి త్వరలో పాకిసాన్ పంజాబ్ సింధ్ ప్రావిన్స్ కూడా భారత్‌లో విలీనమవుతుంది.

Pakisthan: త్వరలో పాక్ నాలుగు ముక్కలవుతుంది.. భారత్‌లో కలుస్తామని ప్రజలు డిమాండ్ చేస్తారంటూ బాబా రామ్ దేవ్ జోస్యం ..
Baba Ram Dev On Pak
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2023 | 9:23 AM

ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ పాకిస్థాన్‌ త్వరలో నాలుగు భాగాలుగా విడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పాక్ ఆక్రమించుకున్న పీఓకేకి విముక్తి లభిస్తుందని.. బలూచిస్థాన్, పంజాబ్, సింధ్‌లు భారత్‌లో విలీనమవుతాయని యోగా గురువు బాబా రామ్‌దేవ్ చెప్పారు. 74వ గణతంత్ర దినోత్సవం రోజున ఆరోగ్యకరమైన, సంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు.

“పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, పీఓకే , పంజాబ్ ప్రత్యేక దేశాలు అవుతాయి. పీఓకే (పాకిస్తాన్-ఆక్రమిత కాశ్మీర్) భారత్‌లో విలీనం అవుతుంది. పంజాబ్, సింధ్, భారతదేశంతో సాంస్కృతిక సారూప్యతలను కలిగి ఉన్నందున బలూచిస్తాన్ స్వయంగా భారతదేశంలో విలీనం కావాలని కోరుకుంటుందని చెప్పారు. అంతేకాదు అతి త్వరలో పాకిసాన్ పంజాబ్ సింధ్ ప్రావిన్స్ కూడా భారత్‌లో విలీనమవుతుంది. బలూచిస్థాన్ కూడా భారత్‌లో కలిసిపోయి భారత్ అగ్రరాజ్యంగా మారుతుంది. ఇది రానున్న కాలంలో అక్కడ ప్రజల డిమాండ్ గా మారుతుందని.. బాబా రామ్‌దేవ్ జోస్యం చెప్పారు.

బాగేశ్వర్ ధామ్‌కు చెందిన ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశ వ్యతిరేక శక్తుల కుట్ర పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాబా రామ్ దేవ్. “సనాతన ధర్మాన్ని తక్కువ చేసి  చూపించేందుకే మత తీవ్రవాదం జరుగుతోందని.. సార్వత్రిక విలువలు, అంతర్గత విలువలు సనాతన ధర్మం సొంతమంది..  మన గ్రంధాల సాకుతో కొన్నిసార్లు.. కొందరు మహానుభావుల పాత్రపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..