Farmers Protest: రైతుల ఆందోళనకు దిగివచ్చిన కేంద్రం.. రేపటి నుంచి పంట కొనుగోళ్లకు హర్యానా, పంజాబ్‌ గ్రీన్‌సిగ్నల్..!

Govt. Procurement of Paddy: పంటకు గిట్టుబాటు ధర కోసం పంజాబ్‌ ,హర్యానా రైతులు చేపట్టిన ఆందోళనకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చాయి. పంటకొనుగోళ్లకు కేంద్రం అంగీకరించింది.

Farmers Protest: రైతుల ఆందోళనకు దిగివచ్చిన కేంద్రం.. రేపటి నుంచి పంట కొనుగోళ్లకు హర్యానా, పంజాబ్‌ గ్రీన్‌సిగ్నల్..!
Govt Procurement Of Paddy
Follow us

|

Updated on: Oct 02, 2021 | 8:19 PM

Farmers Protests: పంటకు గిట్టుబాటు ధర కోసం పంజాబ్‌ ,హర్యానా రైతులు చేపట్టిన ఆందోళనకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చాయి. పంటకొనుగోళ్లకు కేంద్రం అంగీకరించింది. నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో పంట కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి అశ్విని చౌబే ప్రకటించారు. అంతకుముందురు తడిసిన ధ్యానం కొనుగోళ్లకు ప్రభుత్వం ఒప్పుకోకపొవడంతో రైతులు భారీ ఆందోళనలు చేపట్టారు. హర్యానా రణరంగంగా మారింది. అన్నదాతలు హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌ ఇంటిని ముట్టడించారు. వందలాది మంది రైతులు బారికేడ్లను కూడా నెట్టుకుంటూ చొచ్చుకొచ్చేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి.

హర్యానాతో పాటు పంజాబ్‌లోనూ పలువురు బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడించారు అన్నదాతలు. రైతుల ఆందోళనలతో భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లు ధ్వంసం చేసిన రైతులు ముందుకు దూసుకెళ్లారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ట్రాక్టర్లతో దూసుకెళ్లడంతో చాలా చోట్ల పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీఛార్జ్‌ చేశారు. వాటర్‌ కెనాన్లను కూడా ప్రయోగించారు. అయినప్పటికి రైతులు వెనక్కి తగ్గలేదు. చివరకు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగిరావడంతో హర్యానా రైతులు ఆందోళనలను విరమించారు. కాని పంజాబ్‌ రైతులు మాత్రం ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఏడాది నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, యూపీ సరిహద్దుల్లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఈ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని, రైతులతో చర్చలకు తాము సిద్ధమేనని చెబుతోంది కేంద్రం. పరిస్థితిని సమీక్షించిన హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ కట్టర్‌ రైతులు ఆందోళనలు విరమించాలని కోరారు. రైతుల ఆందోళనపై ప్రధాని మోదీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు మేధావులని భ్రమపడే వాళ్లు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

ఇదిలావుంటే పంజాబ్‌, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే శనివారం తెలిపారు. ఈ అంశంపై తనను ఢిల్లీలో కలిసిన హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో కలిసి ఈ మేరకు సంయుక్తంగా ప్రకటించారు.

Read Also… Corona Third Wave: దేశవ్యాప్తంగా మరోసారి మోగిన వార్నింగ్ బెల్స్.. పండుగ సీజన్‌లో థర్డ్ వేవ్ విజృంభణః ఎయిమ్స్ డైరక్టర్