Chidambaram: కుప్పకూలిన కాంగ్రెస్ నేత చిదంబరం! హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..
కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సమయంలో వేడి కారణంగా స్పృహ కోల్పోయి కుప్పకూలారు. వెంటనే ఆయనను జైడస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. తీవ్రమైన వేడి, డీహైడ్రేషన్ కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరం స్పృహ కోల్పోయి కుప్పకూలారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండ వేడి కారణంగా చిదంబరం స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఆయనను పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిదంబరం పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. తన తండ్రి క్షేమంగా ఉన్నారని కార్తీ చిదంబరం కూడా వెల్లడించారు.
79 ఏళ్ల చిదంబరం క్షేమంగా ఉన్నారని, వైద్యులు ఆయనను పరీక్షిస్తున్నారని ఎక్స్‌లో కార్తీ పేర్కొన్నారు. “మా నాన్న అహ్మదాబాద్‌లో తీవ్రమైన వేడి, డీ హైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనను జైడస్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన వైద్యులో పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన క్షమంగానే ఉన్నారు” అని కార్తీ పోస్ట్ చేశారు. అంతకుముందు రోజు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్మారక చిహ్నంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి కూడా చిదంబరం హాజరయ్యారు.
#WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25
— ANI (@ANI) April 8, 2025
My father @PChidambaram_IN had an episode of presyncope due to extreme heat & dehydration in Ahmedabad & is under observation in Zydus Hospital. The doctors are reviewing his parameters which are currently normal. @ANI @PTI_News
— Karti P Chidambaram (@KartiPC) April 8, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
